మత సహనానికి బహ్రెయిన్ ప్రోత్సహం.. LMRA చీఫ్
- August 01, 2025
మనామా: బహ్రెయిన్ అసోసియేషన్ ఫర్ రిలిజియస్ టాలరెన్స్ అండ్ కోఎక్సిస్టెన్స్ (తా’ష్) అధ్యక్షుడు యూసిఫ్ మొహమ్మద్ బు జబూన్‌ను, అసోసియేషన్ బోర్డు సభ్యులను లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్, హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధ జాతీయ కమిటీ చైర్మన్ శ్రీ నిబ్రాస్ తాలిబ్ సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా తా’ష్ అధ్యక్షుడు “ఇన్ ది హాస్పిటాలిటీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ పీస్” బుక్ కాపీని LMRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కు బహుకరించారు. ఇది వివిధ మతాలు, సంస్కృతుల మధ్య సహనం, శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడంలో చేసిన ప్రయత్నాలను వివరించారు.
బహ్రెయిన్ రాజు హమద్ నాయకత్వంలో.. క్రౌన్ ప్రిన్స్ , ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మార్గదర్శకత్వంలో మత సామరస్యం, సాంస్కృతిక వైవిధ్యం విలువలను నిలబెట్టడానికి బహ్రెయిన్ దృఢమైన నిబద్ధతను తాలిబ్ ప్రశంసించారు. పరస్పర గౌరవాన్ని పెంపొందించడం, బహ్రెయిన్ మత, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటం లక్ష్యంగా అసోసియేషన్ కీలక కార్యక్రమాలను కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. సమాజంలో సహజీవనాన్ని బలోపేతం చేయడం అనే వారి ఉమ్మడి లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి సహకారాన్ని పెంచే మార్గాలను ఇరుపక్షాలు చర్చించాయి.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







