ప్రపంచ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్..స్థిరంగా ఖతార్..యూఏఈ టాప్..!!
- August 02, 2025
దోహా: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజా నివేదికలో ఖతార్ తన స్థానాన్ని నిలుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా 47వ స్థానంలో.. మధ్యప్రాచ్య దేశాలలో రెండవ స్థానంలో ఉంది. ముందస్తు వీసా లేకుండా ఖతార్ వాసులు.. ప్రపంచవ్యాప్తంగా 227 డెస్టినేషన్స్ లో 112 వాటిని యాక్సెస్ చేయవచ్చు.
GCC దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తర్వాత ఖతార్ రెండవ స్థానంలో ఉంది. యూఏఈ రెండు స్థానాలు ఎగబాకి 184 డెస్టినేషన్స్ కు వీసా-రహిత యాక్సెస్ ను అందిస్తోంది. ఇతర గల్ఫ్ దేశాలు చూస్తే.. కువైట్ (50వ స్థానం, 100 డెస్టినేషన్స్), సౌదీ అరేబియా (54వ స్థానం, 91 డెస్టినేషన్స్), బహ్రెయిన్ (55వ స్థానం, 90 డెస్టినేషన్స్), ఒమన్ (56వ స్థానం, 88 డెస్టినేషన్స్) ఉన్నాయి.
ఆసియా దేశాలు
ఆసియా దేశాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. టాప్ లో సింగపూర్ పౌరులు 193 డెస్టినేషన్స్ కు వీసా లేకుండానే వెళ్లవచ్చు. జపాన్, దక్షిణ కొరియా 190 డెస్టినేషన్స్ తో రెండవ స్థానంలో ఉన్నాయి.
ఇక, ఇండియా గత సంవత్సరం 85వ స్థానంలో ఉండగా, ఎనిమిది స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి చేరుకుంది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు 59 డెస్టినేషన్స్ కు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు.
తగ్గిన యూఎస్, యూకే ర్యాంక్స్
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లుగా నిలిచిన యూఎస్, యూకే దేశాలు ర్యాంకింగ్‌లలో పడిపోతూనే ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ 10వ స్థానానికి (182 డెస్టినేషన్స్)పడిపోగా.. 20 సంవత్సరాల ఇండెక్స్ చరిత్రలో అమెరికాకి ఇప్పటివరకు ఇదే అత్యల్ప స్థానం. యునైటెడ్ కింగ్‌డమ్ కూడా ఒక స్థానం దిగజారి 6వ స్థానానికి(186 డెస్టినేషన్స్) చేరుకుంది.
ఖతార్‌లో అత్యధిక సంఖ్యలో పౌరులు నివసిస్తున్న దేశాలు
1. భారతదేశం (77వ స్థానం, 59 డెస్టినేషన్స్)
2. బంగ్లాదేశ్ (94వ స్థానం, 39 డెస్టినేషన్స్)
3. నేపాల్ (95వ స్థానం, 38 డెస్టినేషన్స్)
4. ఈజిప్ట్ (85వ స్థానం, 49 డెస్టినేషన్స్)
5. ఫిలిప్పీన్స్ (72వ స్థానం, 65 డెస్టినేషన్స్)
6. పాకిస్తాన్ (96వ స్థానం, 32 డెస్టినేషన్స్)
7. శ్రీలంక (91వ స్థానం, 42 డెస్టినేషన్స్)
8. సూడాన్ (92వ స్థానం, 41 డెస్టినేషన్స్)
9. సిరియా (98వ స్థానం, 27 డెస్టినేషన్స్)
10. జోర్డాన్ (84వ స్థానం, 51 డెస్టినేషన్స్)
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు (జూలై 2025 నాటికి)
1. సింగపూర్ (193 డెస్టినేషన్స్)
2. జపాన్, దక్షిణ కొరియా (190 డెస్టినేషన్స్)
3. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ (189 డెస్టినేషన్స్)
4. ఆస్ట్రియా, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్వీడన్ (188 డెస్టినేషన్స్)
5. గ్రీస్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ (187 డెస్టినేషన్స్)
6. యునైటెడ్ కింగ్‌డమ్ (186 డెస్టినేషన్స్)
7. ఆస్ట్రేలియా, చెకియా, హంగేరీ, మాల్టా, పోలాండ్ (185 డెస్టినేషన్స్)
8. కెనడా, ఎస్టోనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (184 డెస్టినేషన్స్)
9. క్రొయేషియా, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (183 డెస్టినేషన్స్)
10. ఐస్లాండ్, లిథువేనియా, యునైటెడ్ స్టేట్స్ (182 డెస్టినేషన్స్)
అట్టడుగున ఆఫ్ఘనిస్తాన్ 99వ స్థానంలో(25 డెస్టినేషన్స్) ఉంది. ఇక 27 డెస్టినేషన్స్ తో సిరియా 98వ స్థానంలో ఉంది. 30 డెస్టినేషన్స్ తో ఇరాక్ 97వ స్థానంలో ఉందని హెన్లీ & పార్టనర్స్ CEO డాక్టర్ జుర్గ్ స్టెఫెన్ తెలిపారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్