ఫ్లైట్ లో చెంపదెబ్బ వీడియో వైరల్..ఇండిగో క్లారిటీ..!!

- August 02, 2025 , by Maagulf
ఫ్లైట్ లో చెంపదెబ్బ వీడియో వైరల్..ఇండిగో క్లారిటీ..!!

యూఏఈ: ఇండిగో ఫ్లైట్ లో జరిగిన వివాదంపై విమానయాన సంస్థ స్పందించింది. తమ ఫ్లైట్ ఒకదానిలో ఇద్దరు వ్యక్తుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుందని తెలిపింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు ఆవేశంలో మరో ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టాడని భారత విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది. ఇటువంటి చర్యలను ఎలాంటి పరిస్థితుల్లో సహించమని, చట్టం, నిబంధనలను ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని తన ప్రకటనలో ఇండిగో హెచ్చరించింది.    

కాగా, ఫ్లైట్ డెస్టినేషన్ చేరగానే చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిని భద్రతా అధికారులకు అప్పగించినట్లు పేర్కొంది.  ఇండిగో సిబ్బంది చాలా ఓర్పు, సంయమనంతో వ్యవహరించారని అభినందించింది.  ఫ్లైట్ లో ప్రయాణికులు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని నిర్వహించడానికి కట్టుబడి ఉండాలని పేర్కొంది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com