డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్ -1 లో భారత్ గెలుపు
- July 16, 2016
డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1 లో భారత్ అదరగొడుతుంది. దక్షిణ కొరియాతో జరుగుతున్నపోరులో భారత్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది. తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్ ల్లో విజయం సాధించి సత్తా చాటిన భారత జట్టు.. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ లో కూడా విజయం సాధించింది. భారత పురుషుల డబుల్స్ లో భాగంగా లియాండర్ పేస్-రోహన్ బోపన్న జోడి 6-3, 6-4, 6-4 తేడాతో హాంగ్ చుంగ్-యున్‌సియోంగ్ చుంగ్ ద్వయాన్ని మట్టికరిపించింది.తొలి సెట్ ను అవలీలగా గెలిచిన పేస్ జంట.. రెండు, మూడు సెట్లలో పోరాడి గెలిచింది. గంటా 41 నిమిషాల పాటు జరిగిన డబుల్స్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అంచనాలను తగ్గట్టు రాణించి చక్కటి గెలుపును సొంతం చేసుకున్నారు. ఓవరాల్ గా 17 పాయింట్లను మాత్రమే తమ సర్వీస్ ల ద్వారా కోల్పోయిన భారత జట్టు ఆద్యంత నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంది. తద్వారా భారత్ 3-0 ఆధిక్యం సాధించిన భారత్.. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన డేవిస్ కప్ పోరులో భారత ఆటగాడు రామ్‌కుమార్ 6-3, 2-6, 6-3, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సియోంగ్ చాన్ హాంగ్‌కు తొడ కండరాలు పట్టేశాయి. నొప్పిని భరించలేక సియోంగ్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో చైర్ అంపైర్ రామ్‌కుమార్‌ను విజేతగా ప్రకటించారు. ఇక రెండో సింగిల్ మ్యాచ్ లో సాకేత్ 6-1, 3-6, 6-4, 3-6, 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో యోంగ్‌కు లిమ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో సాకేత్ విజయం ఖరారైంది. ఆదివారం నాటి సింగిల్స్ మ్యాచ్ లో సియోంగ్ చాన్ హాంగ్ తో సాకేత్ మైనేని తలపడతాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







