పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వెంకట సుబ్బారావుకు జాతీయ పురస్కారం
- August 02, 2025
హైదరాబాద్: అపరిమిత దేశభక్తి మరియు నిస్వార్థ ప్రజాసేవకు ప్రతీక అయిన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరుతో ఇచ్చే అవార్డును ఈ ఏడాది భూదాన ఉద్యమకారుడు, ప్రముఖ సామాజిక సేవకుడు గోవిందరాజు వెంకట సుబ్బారావు అందుకున్నారు. ఈ సందర్భంగా హర్యానా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై, అవార్డు అందజేశారు.
వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో త్యాగరాయ గాన సభలో నిర్వహించిన పింగళి వెంకయ్య 148వ జయంతి ఉత్సవంలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది.ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, “జాతీయ జెండా ఒక్క దేశానికే కాదు, జాతి గర్వానికి చిహ్నం.అటువంటి త్రివర్ణ పతాకాన్ని గాంధీ సూచన మేరకు రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య,” అని ప్రశంసించారు.
పురస్కార గ్రహీత వెంకట సుబ్బారావు గురించి మాట్లాడుతూ, ఆయన భూదాన ఉద్యమం, మధ్యపాన నిషేధ ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా, వికలాంగులు, బడుగు బలహీన వర్గాలకు విద్య, వైద్యం, ఆహారం, వసతి వంటి అంశాల్లో సేవలు అందించారని వివరించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డా. కె.వి.రమణ మాట్లాడుతూ, “జాతీయ జెండా దేశ ఆత్మ గౌరవానికి ప్రతీక. అటువంటి జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య సేవలు మరువలేనివి,” అన్నారు.
పురస్కార గ్రహీత వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, “92 ఏళ్ళ వయసులో పింగళి వెంకయ్య పేరిట అవార్డు పొందడం గర్వకారణం. ఇది నా జీవితంలో మరిచిపోలేని స్మృతి,” అని చెప్పారు.
వేదికపై పింగళి వెంకయ్య మనవడు నరసింహం మాట్లాడుతూ, “నెహ్రూ నుంచి ఏ ప్రధానమంత్రి కూడా వెంకయ్య గారిని జాతీయ జెండా రూపకర్తగా గుర్తించలేదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆయనను గౌరవంగా ప్రస్తావించారు,” అని గుర్తు చేశారు.
కార్యక్రమంలో సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, కాగడా మా శర్మ తదితరులు పాల్గొన్నారు.వంశీ రామరాజు కార్యక్రమాన్ని నిర్వహించగా డా.సుధా దేవి స్వాగతం పలికారు. కార్యక్రమ ప్రారంభంలో ఫణి కశ్యప్, ప్రసన్న, రాధా రాణి, రమాదేవి దేశభక్తి గీతాలు ఆలపించి సభకు శోభ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!