నెఫ్రాలజీ దక్షిణ భారత సంఘం 44వ వార్షిక సదస్సు విజయవంతంగా ముగిసింది

- August 03, 2025 , by Maagulf
నెఫ్రాలజీ దక్షిణ భారత సంఘం 44వ వార్షిక సదస్సు విజయవంతంగా ముగిసింది

విజయవాడ: ఆగస్టు 1 నుంచి 3, 2025 వరకు విజయవాడలో జరిగిన దక్షిణ భారత నెఫ్రాలజీ సంఘం (SCISN) 44వ వార్షిక సదస్సు ఘనంగా ముగిసింది.ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ సంఘం అధ్యక్షులు డా.అమ్మన్న,డా.శివరామకృష్ణ నేతృత్వంలో అత్యుత్తమంగా నిర్వహించబడింది.

సదస్సు ప్రారంభోత్సవాన్ని డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం  వైస్ చాన్సలర్ డా. చంద్రశేఖర్ ప్రారంభించారు.దేశ విదేశాల నుండి 600 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో 300కి పైగా శాస్త్రీయ వ్యాసాలు సమర్పించబడ్డాయి. కిడ్నీ సంబంధిత వ్యాధులు, డయాలసిస్, కిడ్నీ మార్పిడి, నూతన ఔషధాలు, సాంకేతిక పరిజ్ఞాన పురోగతులు వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు జరగాయి.

బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన డా.స్వామినాథన్ గారు జెనో ట్రాన్స్‌ప్లాంటేషన్ భవిష్యత్తు, వైద్య పరిశోధనల్లో జరుగుతున్న ప్రగతిపై విశేష ప్రసంగం ఇచ్చారు.

హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ నెఫ్రాలజీ విభాగాధిపతి డా.మంజుషా రైతుల్లో పరాక్వాట్ అనే విషపదార్థం వాడకంతో కలుగుతున్న విషపానం, ఆత్మహత్యలు మరియు మరణాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలని, SCISN ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

గుంటూరు మరియు విజయవాడ నుండి వచ్చిన నెఫ్రాలజిస్టులు ఈ సదస్సు విజయవంతమైన నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించారు.

సదస్సులో పాల్గొన్న ప్రతినిధుల కోసం కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు.సుమారు 350 మంది శీఘ్ర దర్శనం పొందగా, ఆలయ అధికారులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

సదస్సులో పాల్గొన్న ప్రముఖ నెఫ్రాలజిస్టులు:

  • డా.గురుదేవ్ (SCISN అధ్యక్షులు)

  • డా.శ్రీభూషణ్ రాజు (SCISN కార్యదర్శి)

  • డా.శివకుమార్

  • డా.రవిరాజు

  • డా.అనురాధ

  • డా.గిరీష్ నారాయణ్ తదితరులు.

ఈ సదస్సు శాస్త్రీయ విజ్ఞానానికి వేదికగా, ఆరోగ్య విధానాలపై చర్చలకు మరియు సాంస్కృతిక పరస్పర సంబంధాలకు ప్రతిరూపంగా నిలిచి విజయవంతంగా ముగిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com