'సు ఫ్రమ్ సో' ఆగస్ట్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్

- August 03, 2025 , by Maagulf
\'సు ఫ్రమ్ సో\' ఆగస్ట్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్

కన్నడలో లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ‘సు ఫ్రమ్ సో’ ఇప్పుడు తెలుగులో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది తెలుగు ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఆగస్ట్ 8న గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది.

ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ కు జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో  షనీల్ గౌతమ్, జెపి తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె తుమినాడు, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్ అద్భుతమైన నటనతో అలరించారు.

శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలసా, రాజ్ బి శెట్టి నిర్మించిన ఈ చిత్రం కన్నడలో క్రిటిక్స్ అప్రిసియేషన్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఘన విజయం సాధించింది.

ఎస్. చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ, సుమేధ్ కె సాంగ్స్, సందీప్ తులసీదాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుచాయి.

ఈ బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైనర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
 
పర్ఫెక్ట్ హ్యూమర్, రిఫ్రెషింగ్ నరేషన్, ఆసక్తికరమైన పాత్రలు కలగలిపిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నవ్వుల పండుగ అందించబోతోంది.

నటీనటులు: షనీల్ గౌతమ్, జెపి తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె తుమినాడు, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్

రచన & దర్శకత్వం-JP తుమినాడ్
‎నిర్మాతలు-శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలస, రాజ్ బి శెట్టి
రిలీజ్: మైత్రీ మూవీ మేకర్స్
‎ఫోటోగ్రఫీ డైరెక్టర్-ఎస్.చంద్రశేఖరన్
‎సంగీతం-సుమేద్ కె
‎బ్యాక్‌గ్రౌండ్ స్కోర్-సందీప్ తులసీదాస్
‎PRO - వంశీశేఖర్
‎మార్కెటింగ్-ఫస్ట్ షో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com