DoT అలర్ట్.. 4 లక్షల సిమ్ కార్డులు బ్లాక్..
- August 05, 2025
ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరి ఫోన్‌లో ఒకటికి మించి సిమ్ కార్డులు వాడేస్తున్నారు.డ్యూయల్ సిమ్ ఫోన్లు కావడంతో రెండు వేర్వేరు నెట్‌వర్క్‌లు లేదా ఒకే నెట్‌వర్క్ కలిగిన సిమ్ కార్డులను వాడుతున్నారు. మీరు కూడా ఒకే మొబైల్‌లో రెండుకు మించి సిమ్ కార్డులు వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..
ఇంతకీ మీకెన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోండి. భారత టెలికాం శాఖ (DoT) దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల సిమ్ కార్డులను (mobile numbers Block) బ్లాక్ చేసింది. ఇందులో ఎక్కువ భాగం ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా లేదా నిబంధనలను ఉల్లంఘించి జారీ చేసిన సిమ్ కార్డులే ఉన్నాయి. సంచార్ సాథీ పోర్టల్, AI- ఆధారిత డిజిటల్ యానాలిసిస్ ఆధారంగా ఈ చర్య తీసుకుంది.
మీ ఫోన్ నంబర్లు, సిమ్ కార్డుల అథెంటిసిటీ ప్రొటెక్ట్ చేసేందుకు DoT చర్యలు చేపట్టింది. సాధారణంగా, ఒక వ్యక్తికి 9 సిమ్‌ల పరిమితి కన్నా ఎక్కువ సిమ్‌లు ఉన్న లేదా రిజిస్ట్రేషన్‌లో లోపాలు ఉన్నట్లు తేలిన ఆయా సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయి.
ఈ క్యాంపెయిన్ లక్ష్యం సైబర్ నేరాలను నివారించడంతో పాటు మోసపూరిత కాల్స్, SMS లేదా ఆర్థిక మోసాలను నిరోధించడమే. అలాగే, సిమ్ బ్లాకింగ్ అనేది వెంటనే అయిపోతుంది. సంచార్ సాథీ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల ద్వారా చాలా మంది యూజర్ల మొబైల్ నెంబర్లు బ్లాక్ అయ్యాయి. మీ మొబైల్ సిమ్ కూడా బ్లాక్ అయిందో లేదో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు.
DoT సిమ్ బ్లాక్ చేయడానికి కారణాలివే:
DoT ప్రకారం..ఒక వ్యక్తి పేరు మీద 9 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలి. బీహార్, జార్ఖండ్‌లోని అనేక ప్రాంతాలలో కొంతమంది ఈ పరిమితిని ఉల్లంఘించారు.ఫేక్ డాక్యుమెంట్ల సాయంతో ఇలాంటి అనేక కనెక్షన్‌లు జారీ అయ్యాయి. అందుకే ఆ శాఖ ఈ సిమ్ కార్డులను డియాక్టివేట్ చేసింది.
వినియోగదారులు ఏం చేయాలి?
- వినియోగదారులు తమ సెక్యూరిటీ కోసం ఈ కింది విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి.
- SIM, IMEI చెక్ చేయండి: మీ ఫోన్‌లో *#06# డయల్ చేయడం ద్వారా IMEI నంబర్‌ను చెక్ చేయండి. వ్యాలిడిటీని ఆన్‌లైన్‌లో వెరిఫై చేయండి.
- ఆధార్ ఆధారిత ధృవీకరణ: మీ సిమ్‌ను ఆధార్‌కు లింక్ చేసి e-KYC ప్రక్రియను పూర్తి చేయండి.
- DoT సంప్రదించండి: ఫోన్ బ్లాక్ చేస్తే DoT హెల్ప్‌లైన్ (1930) లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.
- మీ పర్సనల్ డేటా భద్రం: తెలియని కాల్స్ లేదా మెసేజ్ పట్ల జాగ్రత్త వహించండి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి.
- ఫేక్ మొబైల్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల కూడా జాగ్రత్త వహించండి.
తాజా వార్తలు
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా
- UAEలో 2027లో పబ్లిక్ హాలిడేలలో భారీ మార్పు.. 2026తో పోలిస్తే తగ్గనున్న సెలవులు
- హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్
- కూరగాయల మార్కెట్లో మద్యం బాటిళ్లు స్వాధీనం..!!
- గల్ఫ్ ఈ-కామర్స్ పెట్టుబడుల్లో సౌదీ అరేబియా ఆధిపత్యం..!!
- గల్ఫ్ టూరిజం రికవరీకి కీలక నిర్ణయాలు..!!
- దుబాయ్‌లో ఒడిశా వైవిధ్యాన్ని చాటిచెప్పిన ODOP ప్రదర్శన
- విద్యుత్, నీటి నెట్‌వర్క్‌లకు నష్టం జరగకుండా ఖతార్‌లో కొత్త నిబంధనలు..!!







