ఈ నెల 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు అన్న సీఎం చంద్రబాబు

- August 06, 2025 , by Maagulf
ఈ నెల 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు అన్న సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషవార్త చెప్పారు. వచ్చే ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.ఈ కొత్త పథకం ప్రారంభ కార్యక్రమంలో అన్ని మంత్రులు పాల్గొనాలని ఆయన ఆదేశించారు.

ఉచిత బస్సు పథకం ప్రారంభానికి ముందు ఆటో డ్రైవర్లతో పరస్పర చర్చ నిర్వహించాలన్న సూచనను మంత్రి నాదెండ్ల మనోహర్ చేశారు.దీని పై స్పందించిన ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఆటో డ్రైవర్ల అభిప్రాయాలు కూడా పథకం అమలులో భాగం కావాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేబినెట్ సమావేశం అనంతరం జరిగిన రాజకీయ చర్చల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలో సింగపూర్ వంటి దేశాల నమ్మకం ఏపీ మీదినుంచి తొలగిపోయిందని అన్నారు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి తెచ్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించారు. సింగపూర్ మంత్రులను బెదిరించిన సందర్భాలు వైసీపీ హయాంలో జరిగాయంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

కేబినెట్ సమావేశంలో నూతన బార్ పాలసీకి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కల్లుగీత కార్మికులకు కేటాయించే బార్ లైసెన్సులు ఎవరైనా బినామీగా తీసుకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం రాజీపడదని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com