మహ్మద్ సిరాజ్ వల్లే మ్యాచ్ గెలవడం పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు
- August 06, 2025
ముంబై: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన అద్భుతమైన ప్రతిభతో భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.హైదరాబాద్ లో, జన్మించిన ఈ యువ గాలి వేగపు బౌలర్ చిన్న వయసులోనే తన కఠోర శ్రమ, పట్టుదలతో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో మరోసారి తన సామర్థ్యాన్ని రుజువు చేశాడు.ముఖ్యంగా లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో అతడు చూపిన దూకుడు, జట్టును విజయపథంలో నడిపిన తీరు ప్రతి భారతీయ అభిమానికి గర్వకారణమైంది.సిరీస్ చివరి రోజున కేవలం 25 బంతుల్లో మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ క్రమాన్ని కుదిపేశాడు.మొత్తం మ్యాచ్‌లో 104 పరుగులకు ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయాన్ని సుస్థిరం చేశాడు.ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది.ఒకే సిరీస్‌లో 1,113 బంతులు వేసి 23 వికెట్లు సాధించడం ఫాస్ట్ బౌలర్‌గా అతని సహనం,శారీరక దృఢత్వానికి ఉదాహరణగా నిలిచింది.
ఈ ప్రదర్శన పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన రెడ్డిట్ ఖాతాలో ప్రత్యేకంగా స్పందించారు. సిరాజ్ బౌలింగ్‌కి తన ప్రశంసల వర్షం కురిపిస్తూ, “సిరాజ్ వైఖరి నాకు చాలా ఇష్టం. అతడు మైదానంలో దూకుడుగా పరుగులు తీసి బౌలింగ్ చేయడం, ప్రతి బంతిని గెలవాలనే తపనతో వేయడం అద్భుతం. ఫాస్ట్ బౌలర్ నుంచి ఇలాంటి ఎనర్జీ రావడం ఏ బ్యాట్స్మన్కీ సవాలు” అని పేర్కొన్నారు.ఈ సిరీస్‌లో మొత్తం 1,113 బంతులు వేసి 32.43 సగటుతో 23 వికెట్లు పడగొట్టి, సిరాజ్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. “జట్టుకు అవసరమైన ప్రతిసారీ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. కానీ అతడి ప్రదర్శనకు దక్కాల్సినంత గుర్తింపు దక్కడం లేదన్నది నా అభిప్రాయం” అని సచిన్ తెలిపాడు.
ఇదే సమయంలో, పనిభారం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై వస్తున్న విమర్శలపైనా సచిన్ స్పందించాడు. బుమ్రా ఆడని టెస్టుల్లో భారత్ గెలిచిందంటూ జరుగుతున్న చర్చను సచిన్ కొట్టిపారేశాడు. “అదంతా కేవలం యాదృచ్ఛికం మాత్రమే” అని స్పష్టం చేశాడు. “బుమ్రా సిరీస్‌ను అద్భుతంగా ప్రారంభించి తొలి టెస్టులోనే ఐదు వికెట్లు తీశాడు. ఆడిన మూడు టెస్టుల్లో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అతని బౌలింగ్ నాణ్యత అసాధారణమైనది. బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు” అని సచిన్ ముగించాడు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









