ఎతిహాద్ రైలు మార్గంలో భారీగా పెరిగిన రెంట్స్, ప్రాపర్టీ రేట్స్..!!

- August 07, 2025 , by Maagulf
ఎతిహాద్ రైలు మార్గంలో భారీగా పెరిగిన రెంట్స్, ప్రాపర్టీ రేట్స్..!!

యూఏఈ: యూఏఈలో ఎతిహాద్ రైల్ రాకతో ప్రాపర్టీ ధరలకు  రెక్కలొచ్చాయి.  రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ సమీపంలోని ఏరియాలలో ప్రాపర్టీ ధరలు, అద్దె రేట్లలో రెండంకెల వృద్ధి నమోదైంది. రాబోయే రోజుల్లో ప్రాపర్టీ ధరలు 25 శాతం వరకు పెరగవచ్చని రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అద్దెలు 15 శాతం వరకు పెరగవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఎతిహాద్ రైలు స్టేషన్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో అద్దె విలువలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.

దుబాయ్ ఫెస్టివల్ సిటీలో ప్రాపర్టీ దరలు, రెంట్స్ 23 శాతం పెరిగాయని, దుబాయ్ మెట్రో బ్లూ లైన్ నిర్మాణం జరిగే ప్రాంతాలలో అద్దెలు ఇప్పటికే 23 శాతం పెరిగాయని బెటర్‌హోమ్స్ అమ్మకాల డైరెక్టర్ క్రిస్టోఫర్ సినా తెలిపారు. ఇక ఎతిహాద్ రైలు స్టేషన్ల సమీపంలోని జోన్‌లలో ప్రాపర్టీ విలువలు సగటున 13 శాతం పెరిగాయని అన్నారు. అల్ జద్దాఫ్ స్టేషన్ సమీపంలో ఉన్న దుబాయ్ ఫెస్టివల్ సిటీ 18 శాతం పెరుగుదలతో ముందంజలో ఉందని, తరువాత దుబాయ్ సౌత్ మరియు దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ పార్క్ 17 శాతం చొప్పున పెరుగుదల నమోదు చేశాయని ఆయన పేర్కొన్నారు.

యూఏఈ జాతీయ రైల్వే ప్రాజెక్ట్ అయిన ఎతిహాద్ రైల్ 2026లో ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. 2030 నాటికి ఏటా 36.5 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా రూపొందించారు. సుమారు 900 కి.మీ. విస్తరించి ఉన్న ఈ రైల్ నెట్‌వర్క్ ఏడు ఎమిరేట్‌లలోని 11 నగరాలను కవర్ చేస్తుంది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com