అసోంలోని కోక్రాఝర్ జిల్లాలో ముగ్గురు బోడో తీవ్రవాదుల హతం
- July 17, 2016
అసోంలోని కోక్రాఝర్ జిల్లాలో ముగ్గురు బోడో తీవ్రవాదులను పోలీసులు, సైన్యం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హతమార్చాయి. ఈ రోజు తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో బొడో తీవ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరిని చూసిన దుండగులు కాల్పులకు దిగడంతో ఆర్మీ, పోలీసు సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరిని రాహుల్ బసుమటరీ, రీతూ బసుమటరీలుగా గుర్తించారు. దుండగుల నుంచి నాలుగు తుపాకులు, గ్రనేడ్లు, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







