కటారాలో ఖతారీ, హైతియన్ సంస్కృతిని తెలిపే పెయింటింగ్స్..!!

- August 08, 2025 , by Maagulf
కటారాలో ఖతారీ, హైతియన్ సంస్కృతిని తెలిపే పెయింటింగ్స్..!!

దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ క్రియేటివిటీ స్క్వేర్ ఎదురుగా ఉన్న భవనం 16లో “ఎ కల్చరల్ బ్రిడ్జ్ త్రూ ఆర్ట్” అనే కళాత్మక పెయింటింగ్ లను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కటారాలోని డిప్యూటీ జనరల్ మేనేజర్, మానవ వనరుల డైరెక్టర్ సైఫ్ సాద్ అల్-దోసారి,  ఖతార్‌లోని హైతీ రిపబ్లిక్ రాయబారి జూనియర్ గుయిలౌమ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

క్యూరేటర్ రోక్సేన్ లెడాన్ పర్యవేక్షణలో హైతియన్ విజువల్ ఆర్టిస్ట్, డిజైనర్ ఓల్ఫర్ గాంథియర్ ఈ పెయింటింగ్ రూపొందించారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధానికి చిహ్నంగా ఈ పెయింటింగ్ ను భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఖతార్‌లోని హైతియన్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com