గాజా వాసులకు నిత్యవసరాలు.. కువైట్ ఎయిర్ బ్రిడ్జి..!!
- August 10, 2025
కువైట్: గాజాకు అత్యవసర మానవతా సహాయం అందించడానికి కువైట్ ఎయిర్ బ్రిడ్జిలో భాగంగా తొలి విమానం ఆదివారం అబ్దుల్లా అల్-ముబారక్ ఎయిర్ బేస్ నుండి ఈజిప్ట్‌లోని అల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరుతుందని కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS) ప్రకటించింది. పాలస్తీనియన్లకు అవసరమైన సహాయ సామాగ్రిని ఈ విమానం తీసుకువెళుతుందని KRCS చైర్మన్ ఖలీద్ అల్-ముఘామిస్ తెలిపారు. ఈ మిషన్ ఈజిప్షియన్ మరియు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీలతో పాటు కువైట్ సామాజిక వ్యవహారాలు, రక్షణ విదేశాంగ మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో జరుగుతుందని తెలిపారు.
మరోవైపు గాజా వాసుల కోసం KD 11.5 మిలియన్ల విరాళాలను సేకరించినట్లు కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజా వాసుల కోసం ఆహారం మరియు ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి ఈ నిధులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..