త్వరలో తెలంగాణలో AI యూనివర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
- August 10, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ,టెక్నాలజీ రంగ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. కృత్రిమ మేధస్సు సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ, విద్యార్థులు, నిపుణుల కోసం ఒక ప్రత్యేక ఏఐ యూనివర్సిటీని స్థాపించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఈ యూనివర్సిటీ ద్వారా ఆన్లైన్, ఆఫ్‌లైన్ కోర్సులు అందించబడతాయి. దీని ద్వారా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ఆగస్టు 9న రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో ఏప్యాప్సిస్ (eYappsis) సంస్థ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రపంచ సాంకేతిక రంగంలో కీలక కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు.
గతంలో నగరంలో కేవలం మూడు యూనికార్న్ కంపెనీలు (1 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ సాధించిన స్టార్టప్స్) మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 30 నుంచి 40 మధ్య ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.మంత్రి పేర్కొన్నట్లుగా, తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో కొత్త కంపెనీలను ప్రోత్సహించడంలో ముందంజలో ఉంది. కృత్రిమ మేధస్సు రంగం రాబోయే సంవత్సరాల్లో అన్ని రంగాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే ఈ యూనివర్సిటీ స్థాపన అత్యవసరమని ఆయన చెప్పారు. విద్యార్థులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, టెక్ ప్రొఫెషనల్స్ ఈ యూనివర్సిటీ ద్వారా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీలలో ప్రావీణ్యం సాధించవచ్చు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి