సలాలాలో ఒమానీ-బహ్రెయిన్ ప్రదర్శన ప్రారంభం..!!
- August 11, 2025
సలాలా: ఒమన్ లోని సలాలా విలాయత్ లో ఐదవ ఎడిషన్ ఒమానీ-బహ్రెయిన్ సంయుక్త వస్తు ప్రదర్శన ప్రారంభమైంది. దీనిని ఒమానీ-బహ్రెయిన్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్, ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లు సంయుక్తంగా.. బహ్రెయిన్ లోని ఒమన్ రాయబార కార్యాలయం సహకారంతో నిర్వహిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ పది రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ ప్రదర్శనలో హస్తకళలు, కుండలు , సాంప్రదాయ దుస్తులు వంటి స్మాల్ ఇండస్ట్రీలకు చెందిన ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ప్రదర్శన ఒమన్ - బహ్రెయిన్ మధ్య ఆర్థిక మరియు సాంస్కృతిక వేదికగా పనిచేస్తుందన్నారు. ఇక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఫైసల్ అబ్దుల్లా అల్ రోవాస్ తోపాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







