వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025కు కౌంట్‌డౌన్ స్టార్ట్‌..

- August 11, 2025 , by Maagulf
వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025కు కౌంట్‌డౌన్ స్టార్ట్‌..

ముంబై: మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. భార‌త్, శ్రీలంక దేశాలు ఈ ప్ర‌పంచ‌క‌ప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో 50 రోజుల కౌంట్ డౌన్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐసీసీ అధ్యక్షుడు జైషా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్, మిథాలీ రాజ్‌తో పాటు ప‌లువురు మ‌హిళా క్రికెట‌ర్లు పాల్గొన్నారు.

8 దేశాలు ప్ర‌పంచ‌క‌ప్ కోసం పోటీప‌డ‌నున్నాయి. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఈ మెగాటోర్నీ ఆరంభ వేడుకలు జ‌రగ‌నున్నాయి.అయితే.. ఇటీవ‌ల అక్క‌డ తొక్కిస‌లాట చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో అక్క‌డ పెద్ద ఈవెంట్ల‌కు అనుమ‌తి ఇచ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. ఒక‌వేళ వేడుకలు అక్క‌డ నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితులు ఉంటే.. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో నిర్వ‌హించేలా బీసీసీఐ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com