సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
- August 12, 2025
హైదరాబాద్: దేశంలో సైబర్ నేరాలపై పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో, తాజాగా విడుదలైన గణాంకాల్లో తెలంగాణ రాష్ట్రం అత్యధిక సైబర్ నేరాల నమోదుతో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) 2022 మధ్యంతర గణాంకాల ప్రకారం, తెలంగాణలో సైబర్ నేరాల రేటు దాదాపు 10 రెట్లు దేశ సగటును మించి ఉంది.
నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రేటు సగటున 4.8 శాతంగా ఉండగా, తెలంగాణలో ఇది 40.3 శాతంగా నమోదైంది. ఇది ఆందోళనకరంగా మారింది. దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో చాలా శాతం తెలంగాణకు చెందినవే కావడం గమనార్హం. ఇది రాష్ట్రానికి అప్రతిష్ఠను కలిగిస్తోంది.
దక్షిణ భారతదేశంలో సైబర్ నేరాల గణాంకాల పరంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక రెండో స్థానంలో ఉంది.ఈ రెండు రాష్ట్రాల్లో నేరగాళ్లు అత్యంత చురుకుగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. ఇది పోలీసు విభాగాలకు హెచ్చరికగా మారుతోంది.
ఇతర రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలో సైబర్ క్రైమ్ రేటు 6.6 శాతంగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో 4.4, అసోంలో 4.9, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో 4.3 శాతం చొప్పున ఉంది. పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కేవలం 0.4 శాతం క్రైమ్ రేటుతో మెరుగైన స్థానంలో నిలవడం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ 3.2 శాతం, పుదుచ్చేరి 3.9 శాతం క్రైమ్ రేటుతో సైబర్ నేరాలకు హాట్స్పాట్లుగా మారాయి.
ఢిల్లీ పోలీసుల గణాంకాల ప్రకారం, 2024లో మాత్రమే రూ. 817 కోట్లు విలువైన సైబర్ మోసాలు జరగడం ఆందోళన కలిగించే విషయం. 2025లో తొలి ఆరు నెలల్లోనే మరో రూ. 70.64 కోట్లు మోసపోయారు. దీన్ని బట్టి దేశంలో సైబర్ మోసాల తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
ఈ సైబర్ నేరాలను ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వివరించినట్లు,లోక్సభకు తెలిపారు. ఇందులో భాగంగా ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్’ (I4C) ఏర్పాటు చేశామని, ఆన్లైన్లో ఫిర్యాదుల కోసం ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (http://cybercrime.gov.in) ప్రారంభించామని వివరించారు. దీంతో పాటు, మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు పోలీస్ విభాగాల్లో ప్రత్యేక యూనిట్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







