ఒమన్ లో ముందస్తు రెటినోపతి స్క్రీనింగ్ ప్రోగ్రామ్..!!
- August 14, 2025
మస్కట్: ఒమన్ లో కృత్రిమ మేధస్సు టెక్నాలజీలను ఉపయోగించి డయాబెటిక్ రెటినోపతిని ముందస్తుగా గుర్తించే జాతీయ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 10వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. AI-ఆధారిత జాతీయ స్క్రీనింగ్ కార్యక్రమం ఒమన్ వ్యాప్తంగా 25 ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉందని ఆపరేషనల్ డైరెక్టర్ డాక్టర్ మాజిద్ సలీం అల్ షైబానీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పరిక్షించిన వారిలో దాదాపు 30శాతం మందిలో డయాబెటిక్ రెటినోపతి ముందస్తు లక్షణాలను గుర్తించినట్లు తెలిపారు.
కాగా, డయాబెటిక్ రెటినోపతి నిశ్శబ్ద వ్యాధి అని, తరచుగా తీవ్రమైన సమస్యలు తలెత్తిన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుందని డాక్టర్ అల్ షైబానీ వివరించారు. ముందస్తుగా గుర్తించడం వలన లేజర్ చికిత్స లేదా ఇంట్రాకోక్యులర్ ఇంజెక్షన్ల ద్వారా నివారించడం సాధ్యమవుతుందన్నారు. సకాలంలో చికిత్స అందించకపోతే శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం అన్ని టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ రోగులను కవర్ చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!