రాజస్థానీ పాపడ్ కరివేపాకు
- July 17, 2016
ఇది అప్పడాల తో రాజస్తానివాళ్ళు చేసే కుర ,ఇదివరకు రోజుల్లో. అక్కడ. కూరలు దొరికేవి కావుట..ఎడారి ప్రాంతం,నీటి ఎద్దడి పంటలు పండించే వీలు. చాల తక్కువ వుండడం తో పప్పు దినుసులతో అంటే చానా , రజమ . ఆలు సెనగ పిండితో చేసే కూరలు వాళ్ళ సాంప్రదాయ. వంటలుగా ఉండేవి . తరువాత కేనాల్స్ తవ్వకా ఇపుడు కూరలు పండిస్తున్నరట, ఇక్కడ కూడా. ఎండాకాలం కూరలు దొరకనపుడు రొట్టెలకి ఇది బాగుంటుంది .
కావలసిన పదార్ధాలు..* అప్పడాలు* 3 టమోటాలు* నలుగు పచ్చిమిర్చ* అల్లం* జీలకర్* నూనె* ఇంగువ* కసురిమెంతి* ఉప్పు* పసుపు* కారం* దనియ పొడి
తయారీ విధానం.. * ముందుగా 4,5 అప్పడాలు కాల్చి పెట్టండి .
* ఆ తరువాత టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
* ఇప్పుడు కడాయి పెట్టి రెండు టేబెల్ స్పూన్ల నూనెవేసి జీలకర్ర ,ఇంగువ, కసురిమెంతి వేసి వేగాక ,టమోటా రసం వేసి సరిపడా ఉప్పు పసుపు చెంచ దనియ పొడి ,అరచంచాకారం,వేసి బాగావేయించి అరా గ్లాస్ నీళ్ళు పోసి మూతపెట్టి మారగనీయాలి.
* ఈ లోగ కప్పుడు పెరుగులో కప్పు నీరు పోసి గిలకొట్టి చిక్కటి మజ్జిగ చేయండి .అపుడు కడాయి లో మరిగేనీళ్ళలో కొద్ది కొద్దిగా మజ్జిగ వేస్తూ కలుపుతూ వుండాలి.
* మంట తక్కువ మీద పెట్టి మజ్జిగ కలుపుతూ మరిగాక అప్పడాలు ముక్కలు వేసి మూతపెట్టి రెండు నిముషాలు ఉడికిస్తే అప్పడాలు మజ్జిగ పీల్చుకుంటాయి కొత్తిమీర జల్లి సెమి లిక్విడ్ గా వుండి రొట్టెలకి అప్పడాల వాసనతో కాస్త పుల్లగా,కరంగా బాగుంటుంది .మజ్జిగ తిప్పుతూ ఉండకపోతే విరిగి పోతుంది. చేసి చుడండి.
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







