పార్లమెంటు సమావేశాల్లో హైకోర్టు విభజనే ప్రధాన అజెండా.
- July 17, 2016
సోమవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... తెరాస ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం దిల్లీలో జరిగింది. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఉన్నత న్యాయస్థానం విభజించకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు. అదేవిధంగా కేంద్రం తీసుకొస్తున్న పలు విధానాలపై అంశాల వారీగా మద్దతు తెలపాలని పేర్కొన్నారు.
సమావేశం అనంతరం ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు తెరాస సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. రేపు ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్ భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. హైకోర్టు విభజన అంశం ప్రధాన అజెండాగా పార్లమెంటులో తమ వైఖరి ఉండబోతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలకు కేంద్రం నుంచి ఆర్ధిక సహకారం అందించాలని కోరతామన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







