ప్రపంచ గేమింగ్, ఇ-స్పోర్ట్స్ హబ్ గా సౌదీ వీడియో..!!
- August 14, 2025
రియాద్: సౌదీ అరేబియా వీడియో గేమ్ రంగం గత రెండు సంవత్సరాలలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2024, 2025లో వీడియో గేమ్ కన్సోల్‌ల దిగుమతులు 2.4 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయని జకాత్, టాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ వెల్లడించింది. 2024లో 1.7 మిలియన్ యూనిట్లకు పైగా దిగుమతి చేసుకోగా, 2025లో ఇప్పటివరకు 684,489 యూనిట్లు దిగుమతి అయ్యాయని పేర్కొంది. గేమింగ్ పరికరాలు అత్యధికంగా చైనా నుంచి దిగుమతి అవుతుండగా, ఆ తరువాత స్థానాల్లో యునైటెడ్ స్టేట్స్, జపాన్, వియత్నాం మరియు యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయి.
స్మార్ట్ పరికరాల ద్వారా 24.2 శాతం మంది గేమ్స్ ఆడుతుండగా, ప్లేస్టేషన్ ల ద్వారా 23.8 శాతం మంది గేమ్స్ ఆడుతున్నారు. 10-19 సంవత్సరాల వయస్సు కేటగిరిలో 54.8 శాతం మంది ఫ్లే స్టేషన్ లను వినియోగిస్తున్నారు. మిగిలిన వయస్సు గలవారిలో స్మార్ట్ పరికరాలు అగ్రస్థానంలో ఉన్నాయని నివేదిక తెలిపింది.
స్మార్ట్ పరికరాల్లో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన ఎలక్ట్రానిక్ గేమ్‌లలో వైట్‌అవుట్ సర్వైవల్ మొదటి స్థానంలో ఉండగా, రోబ్లాక్స్ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా సబ్‌వే సర్ఫర్స్, PUBG మొబైల్, గరీనా ఫ్రీ ఫైర్ ఉన్నాయి.
జూలై 7 నుండి ఆగస్టు 24 వరకు రియాద్‌లో జరుగుతున్న ఇ-స్పోర్ట్స్ వరల్డ్ కప్, ప్రపంచ గేమింగ్ హబ్‌గా కింగ్‌డమ్ పెరుగుతున్న పాత్రను బలోపేతం చేస్తుందని నివేదిక తెలిపింది. ఈ ఈవెంట్‌లో 100 కంటే ఎక్కువ దేశాల నుండి 2,000 మంది ఆటగాళ్ళు $70 మిలియన్లకు పైగా బహుమతుల కోసం పోటీ పడుతున్నారని, ఇది ప్రపంచ గేమింగ్ మరియు ఇ-స్పోర్ట్స్ రంగంలో సౌదీ అరేబియా స్థానాన్ని పటిష్టం చేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..