తక్కువ ఆదాయ వర్గాలకు హోమ్ వెంటిలేటర్లు.. కుదిరిన ఒప్పందం..!!

- August 15, 2025 , by Maagulf
తక్కువ ఆదాయ వర్గాలకు హోమ్ వెంటిలేటర్లు.. కుదిరిన ఒప్పందం..!!

మస్కట్: తక్కువ ఆదాయం మరియు సామాజిక భద్రతా విభాగాల రోగులకు వెంటిలేటర్లను కొనుగోలు చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ .. ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ (OMIFCO)తో కుదిరిన ఒక ఒప్పందంపై సంతకం చేసింది. మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ సౌద్ అమెర్ అల్ నుధైరి, OMIFCO కమ్యూనికేషన్ డైరెక్టర్ ఖలీద్ మొహమ్మద్ అల్ ఫన్నా అల్ అరైమి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ప్రజలకు సేవ చేయడానికి ఒమన్ లోని ఇతర రంగాలతో కలిసి పనిచేస్తామని, తన వంతుగా  సమాజంలోని అవసరమైన వర్గాలకు మద్దతు ఇవ్వడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందన్నారు. హోమ్ వెంటిలేటర్లు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయని, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఆసుపత్రి బయట దీర్ఘకాలిక యాంత్రిక వెంటిలేషన్ అవసరమయ్యే కొంతమంది రోగులకు హోమ్ వెంటిలేటర్లు ముఖ్యమైన లైఫ్ లైన్ గా ఉంటుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com