యూఏఈ వచ్చే ఫ్లైట్స్ ఫుల్.. టిక్కెట్ల ధరలకు రెక్కలు..!!

- August 15, 2025 , by Maagulf
యూఏఈ వచ్చే ఫ్లైట్స్ ఫుల్.. టిక్కెట్ల ధరలకు రెక్కలు..!!

యూఏఈ: యూఏఈలో వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో యూఏఈకి వచ్చే ఫ్లైట్స్ అన్ని ఫుల్ అవుతున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఇంకా అందుబాటులో ఉన్న కొద్దిపాటి సీట్ల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.  ఆగస్టు నెల ప్రారంభంతో పోలిస్తే అనేక మార్గాల్లో టిక్కెట్ల ధరలు బాగా పెరిగాయని, కొన్ని గమ్యస్థానాలకు ఛార్జీలు దాదాపు రెట్టింపు అయ్యాయని గలాదరి ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్ మేనేజర్ మీర్ రాజా వాసిమ్ తెలిపారు.

భారతదేశం నుండి సగటు టికెట్ ధర Dh2,000 కంటే ఎక్కువగా ఉందన్నారు.  ఇక ఫ్యామిలీ కోసం బుకింగ్ చేసేటప్పుడు ధర పెరుగుదలలో Dh5,000 నుండి Dh6,000 వరకు తేడా ఉంటుందన్నారు. సాధారణ విమాన ఛార్జీలతో పోలిస్తే ఒక టికెట్‌కు కనీసం Dh1,000 అదనంగా ఉంటుందని వైస్‌ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ అన్నారు. కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ఛార్జీలు కాస్తా తక్కువగా ఉన్నాయని, ఆయా ఫ్లైట్స్ వేగంగా ఫుల్  అవుతున్నాయని పేర్కొన్నారు. 

ఆగస్టు రెండవ భాగంలో అనేక దేశాల నుండి తిరుగు ప్రయాణ ఛార్జీలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. భారతదేశంలోని అనేక రంగాల నుండి సుమారు Dh1,000 ఖరీదు చేసే లేఓవర్ విమాన టిక్కెట్ ధరలు ఇప్పుడు Dh1,500 కంటే ఎక్కువగా ఉన్నాయని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com