వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ మొదలైంది
- August 15, 2025
టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్స్ లో వెంకటేష్, త్రివిక్రమ్ ఒకటి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. అది ఇన్నాళ్లకు తీరింది. ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అది నిజమే అని నాగవంశీ చెప్పిన తర్వాత అంతా ఫిక్స్ అయ్యారు. ఇవాళ ఈ మూవీ అఫీషియల్ గా ఓపెనింగ్ జరుపుకుంది. వెంకటేష్ తో పాటు ఇతర కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన డీటెయిల్స్ చెప్పలేదు కానీ ఓపెనింగ్ అయితే పూర్తయింది. త్రివిక్రమ్ దర్శకుడు కాక ముందు వెంకటేష్ మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ విజయంలో త్రివిక్రమ్ డైలాగ్స్ దే మేజర్ షేర్ అంటే అతిశయోక్తి కాదు. త్రివిక్రమ్ పంచ్ లను తనదైన టైమింగ్ తో వెంకీ పంచిన కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత వాసు చిత్రానికీ రాశాడు. కానీ అంత పేరు రాలేదు. త్రివిక్రమ్ దర్శకుడు అయిన తర్వాత రాసిన మల్లీశ్వరి మరో హైలెట్ మూవీ. మల్లీశ్వరి డైలాగ్స్ కు అద్భుతమైన పేరొచ్చింది. అప్పటి నుంచే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా చూడాలని ఇద్దరి అభిమానులు అనుకుంటున్నారు. అది ఇన్నాళ్లకు ఫైనల్ అయింది. వెంకీ సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ కొట్టి ఉన్నాడు. ఈ టైమ్ లో ఈ కాంబోలో సినిమా అంటే మరో బ్లాక్ బస్టర్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ చిత్రాన్ని హారిక హాసిన బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







