రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

- August 15, 2025 , by Maagulf
రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: భారతీయ సినీ పరిశ్రమలో రజనీకాంత్ ఓ చిరస్మరణీయ నామం. ఆయన సినీ జీవితంలో ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ అరుదైన ఘట్టాన్ని పురస్కరించుకుని, ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపారు.రజనీకాంత్ సినీ రంగంలో అడుగుపెట్టి ఇప్పటికి సరిగ్గా 50 ఏళ్లు. సినిమా ప్రపంచంలో ఇది చిన్న విషయం కాదు. ఒక నటుడిగా తనదైన శైలితో, తనదైన నటనతో ఆయన కోట్ల మంది అభిమానులను సంపాదించారు. ఈ ప్రయాణాన్ని మోదీ ఒక చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు.

ఈ అరుదైన సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు.చిత్ర పరిశ్రమలో అద్భుతమైన 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్‌కి హృదయపూర్వక అభినందనలు. ఆయన సినీ జీవితం ఒక చారిత్రక మైలురాయి, అంటూ ట్వీట్ చేశారు.రజనీకాంత్ చేసిన విభిన్నమైన పాత్రలు, ఆయన చూపించిన అద్భుత నటనపై మోదీ ప్రశంసలు కురిపించారు.తరతరాల ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన వ్యక్తి రజనీకాంత్. ఆయన పాత్రలు అభిమానుల గుండెల్లో చావలేని గుర్తుగా నిలిచిపోయాయి, అని పేర్కొన్నారు.

ప్రస్తుతం కూడా రజనీకాంత్ సినిమాల్లో చురుగ్గా నటిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రధాని మోదీ.ఆకాంక్షించారు.రజినీకాంత్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నది నా మనస్ఫూర్తి కోరిక,” అంటూ ప్రధాని తెలిపారు.రజనీకాంత్‌ నటన కేవలం సినిమాలకే పరిమితం కాదు. ఆయన వినయశీలత, నిజాయితీ, వ్యక్తిత్వం అభిమానులను అలరిస్తుంది. సామాన్య కుటుంబంలో జన్మించి, సూపర్ స్టార్‌ స్థాయికి ఎదగటం అందరికీ స్ఫూర్తిదాయకం.ఈ మైలురాయిని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో #50YearsOfRajinism అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కేవలం అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా రజనీకాంత్‌ను అభినందిస్తున్నారు. తమిళనాడు నుంచే కాకుండా, బాలీవుడ్ నటులు కూడా తమ అభిమానం వ్యక్తం చేశారు.రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం సినిమా ప్రేమికులకు ఒక స్ఫూర్తి. ఆయన నటన, వ్యక్తిత్వం, దశాబ్దాల సినీ సేవ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. ఈ చారిత్రక ఘట్టానికి ప్రధాని మోదీ ఇచ్చిన శుభాకాంక్షలు, రజనీ స్థాయిని మరింత విస్తృతంగా చాటుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com