సౌదీ అరేబియాలోని భారీ వర్షాలు, వరదలు.. సివిల్ అలెర్ట్ జారీ..!!
- August 16, 2025
రియాద్: సౌదీ అరేబియాలో రాబోయే మూడు నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని, వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పౌర రక్షణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మక్కా ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, దీనివల్ల ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. మక్కా నగరం, తైఫ్, మైసాన్, అధమ్, అల్-అర్దియత్, అల్-లైత్, అల్-కున్ఫుధా, అల్-జుముమ్, అల్-కామిల్, బహ్రా, అల్-మువైహ్, తుర్బా, అల్-ఖుర్మా మరియు రన్యా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని వెల్లడించారు.
ఇక జజాన్, అసిర్, అల్-బహా మరియు నజ్రాన్లలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, రియాద్ , మదీనా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మీడియా మరియు సోషల్ మీడియా ఛానెల్ల ద్వారా అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని సివిల్ డిఫెన్స్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







