పడవ బోల్తా.. 40 మంది మిస్సింగ్‌

- August 18, 2025 , by Maagulf
పడవ బోల్తా.. 40 మంది మిస్సింగ్‌

నైజీరియాలోని వాయువ్య సోకోటో రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్కు వెళ్తున్న ఓ పడవ ప్రమాదాని కి గురైంది.ఈ ప్రమాదంలో 40 మంది గల్లంతు అయ్యారు. ప్రమాదసమయంలో పడవలో 50మంది ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. కాగా 10మందిని ప్రాణాలతో రక్షించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.

అధికారులు గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాణాలతో బయటపడ్డవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇటీవల తరచుగా నైజీరియాలో పడవ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో కరువు, అంతర్గత పోరాటాల కారణంగా చాలామంది అక్రమంగా పొరుగుదేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రమాదకరమైన చిన్న పడవలలో ప్రయాణిస్తూ, మత్యువాత పడుతున్నారు. పడవ యజమానులు సైతం డబ్బు ఆశతో సామర్థ్యానికి మించిన ప్రయాణికులను తీసుకెళ్తూ, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి, ఇలాంటి ప్రమాదలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com