షార్జాలో దారుణం ఎర్రని ఎండలో పసిబాబుని డాబాపై వదిలి వెళ్లిన కసాయిలు
- July 17, 2016
అప్పుడే పుట్టిన పాలబుగ్గల పసిబాబును నిప్పులు చెరిగే వేసవి ఎండలో డాబా పైకప్పుపై నిర్దయగా వదిలి వెళ్ళిన ఆ దుర్మార్గుల గూర్చి షార్జాలో పలువురు చర్చించుకొంటున్నారు. అయితే ఆశర్యకర పరిస్థితుల్లో ఆ ఖాళీ ఇంటి పైకప్పు నుంచి ఆ మగ శిశువుని రక్షించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షార్జా సమీపంలోని అల్ రామల్లా ప్రాంతంలో ఈ పసిపాప లభ్యమైన ఇంటికి తదుపరి ఇంటిలో నివసిస్తున్న ఒక వ్యక్తి ద్వారా ఈ సమాచారం కనుగొనబడింది. ఎక్కడో ఓ పసిగుడ్డు గుక్కపట్టి ఏడుస్తున్నట్లు వినిపించిందని ఇది ఎక్కడ్నించి వినిపిస్తుందోనని కనుగొనేందుకు ఆ వ్యక్తి నిర్ణయించుకొని వెతగ్గా తమ పొరుగున ఉన్న డాబా పైకప్పు మీద ఒక పసిబిడ్డని కనుగొన్నాడు. ఆ బిడ్డ విపరీతంగా ఏడవటమే కాక తీవ్ర వేడిమిని వెదజల్లే సూర్యుడు కింద ఎంతో చెమట పట్టిన స్థితిలో , డాబా మీద ఆ శిశువు దొరికేడు. ఆ నవజాత బాలునికి వస్త్రంని ముక్కలు చేసి పొత్తిళ్ళలలో చుట్టి మరియు ఒక చిన్నచెక్కపెట్టె లోపల దాచేరుపోలీసులకు ఈ శిశువు ఆచూకీ గూర్చి తెలిపారు. అలాగే , ఫోరెన్సిక్ బృందం, నేర విభాగం,గస్తీ విభాగంకు సమాచారం ఇవ్వబడింది.షార్జా అంబులెన్స్ అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి చేరుకొని పైకప్ప మీద ఉన్న ఆ బాలుడ్ని పరిశీలించగా, ఆ చెక్కపెట్టే లోని రగులుకొన్న అత్యంత వేడి కారణంగా స్పృహ కోల్పోయినట్లు కనుగొన్నారు.దీనితో పోలీసులు అల్ ఖ్అసిమి హాస్పిటల్ కు ఆ పసిబిడ్డని తరలించారు. బిడ్డ తల్లిదండ్రులని కనుగొనేందుకు ఆ ప్రదేశంలో వేలు ముద్రలు మరియు పాదముద్రలు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆసుపత్రిలో వైద్య వివరాల ప్రకారం, శిశువు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పుడు తీసుకు వచ్చారని, దయ లేని ఆ తల్లితండ్రులు ఆ పసిబిడ్డను భగ భగ మండే సూర్యుని కింద నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం డాబా పై భాగాన ఉంచినట్లు వివరించారు. పోలీసు విచారణ విధానాలు పూర్తి అయ్యేవరకు ఈ శిశువుని ఆసుపత్రి లో ఉంచబడుతుంది. తరువాత, ఆ బిడ్డకు అవసరమైన సంరక్షణ కోసం సామాజిక సేవ విభాగంను సూచిస్తారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం, పసిబిడ్డ దొరికిన ఇంటిలో ఒక ఫిలిప్పియన్ కుటుంబం నివసిస్తుందని, ఇంటి యజమానిని ఇప్పటికే అదుపులోనికి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారని తెలిసింది.కాగా బాలుని తల్లి ఆచూకీ కోసం శోధిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







