దళారులను నమ్మకండి..భక్తులకు TTD సూచన
- August 19, 2025
తిరుమల: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. స్వామి వారి దర్శనం కోసం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే వెళ్తుంటారు. టీటీడీ కూడా భక్తుల రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా దర్శనం టికెట్ల ను రిలీజ్ చేస్తుంటుంది. అయితే స్వామి వారి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.గత సంవత్సరం ఆగస్టు 16న వనం నటరాజ నరేంద్రకుమార్, కేఎస్ నటరాజశర్మ అనే ఇద్దరు వ్యక్తులు స్వామి వారి వీఐపీ దర్శనం కోసం రూ.90వేలు తీసుకున్నారని.. టికెట్ల కోసం ఎన్ని సార్లు ఫోన్ చేసినా..స్పందించడం లేదని విశ్వనాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. స్వామి వారి దర్శనం కోసం దళారులను నమ్మొద్దని.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోవాలని సూచించారు. కాగా నిందితులు గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డారని.. వారిపై 12 కేసులు నమోదు అయినట్లు విచారణలో తేలింది. దళారులను గుర్తిస్తే 0877-2263828లో ఫిర్యాదు చేయాలని టీటీడీ సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







