ఒమన్‌లో కవి సౌద్ అల్-ఖహ్తానీ మృతికి సౌదీ అరేబియా సంతాపం..!!

- August 20, 2025 , by Maagulf
ఒమన్‌లో కవి సౌద్ అల్-ఖహ్తానీ మృతికి సౌదీ అరేబియా సంతాపం..!!

రియాద్: ప్రఖ్యాత సౌదీ కవి సౌద్ బిన్ మాది అల్-ఖహ్తానీ సోమవారం ఒమన్‌లోని దోఫర్ గవర్నరేట్‌లోని మిర్బాత్‌లోని జబల్ సంహాన్‌లోని ఎత్తైన పర్వతంపై నుండి పడి మరణించారు. అతనికి పర్వతారోహణ అనేది ఇష్టమని, ఈ క్రమంలోనే పర్వతం ఎక్కుతూ జారీ పడ్డారని అధికారులు తెలిపారు.  కాగా, కవి అల్-ఖహ్తానీ మరణంపై మస్కట్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. అతని మృతదేహాన్ని సౌదీ అరేబియాకు తరలించే ప్రక్రియలను పూర్తి చేయడానికి మానీ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.

సౌదీ మరియు గల్ఫ్ కవిత్వంలో అల్-ఖహ్తానీ ప్రసిద్ధి చెందారు. ఆయన మృతికి సౌదీ సాహిత్య ప్రపంచం సంతాపం తెలిపింది. సోషల్ మీడియా ద్వారా అల్-ఖహ్తానీకి పలువురు నివాళులర్పించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com