కత్తిలాంటోడికి ఆదిలోనే అడ్డంకులా?

- July 18, 2016 , by Maagulf
కత్తిలాంటోడికి ఆదిలోనే అడ్డంకులా?

మెగాస్టార్ ఫ్యాన్స్‌కి షాక్. చిరంజీవి న్యూప్రాజెక్ట్ కత్తిలాంటోడికి ఆదిలోనే అడ్డంకులా? ఈ మూవీ షూటింగ్‌ని అర్ధాంతరంగా ఆపేసినట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తనకు- ఆలీకి మధ్య తీసిన కామెడీ సీన్స్ చిరంజీవికి నచ్చలేదని, తిరిగి రీషూట్ చేయాలని ఆయన కోరారని అందుకే షూటింగ్ నిలిచిపోయిందన్నది అందులోని సారాంశం.
పైగా స్ర్కిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని మెగాస్టార్ కోరాడని అంటున్నారు. దీంతో పరుచూరి సోదరులతోపాటు సాయి బుర్రామాధవ్ స్ర్కీన్‌ప్లేపై దృష్టి పెట్టి తుది మెరుగులు దిద్దే పనిలోపడినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. డైరెక్టర్ వీవీ వినాయక్ ఇందుకు సరేనన్నట్టు ఇన్‌సైడ్ సమాచారం. ఈ గ్యాప్‌లో చెర్రీ 'ధృవ'పై ఫోకస్ పెట్టనున్నాడు. వీలైతే కొన్ని సూచనలు చరణ్ ఇవ్వవచ్చని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com