కల్యాణకట్ట ఆధునీకరణకు ప్రణాళికలు

- August 22, 2025 , by Maagulf
కల్యాణకట్ట ఆధునీకరణకు ప్రణాళికలు

తిరుమల: పుణ్యక్షేత్రం తిరుమలకు వస్తున్న భక్తులు తమ మొక్కుబడుల్లో భాగంగా స్వామివారికి సమర్పించుకుంటున్న కానుకల్లో తలనీలాలు ఇవ్వడం మరింత విశ్వాసంతో కూడుకుంది. ఎప్పుడో పదిదశాబ్దాల క్రిందట తిరుమలలో నిర్మించిన కల్యాణకట్ట ఇప్పటి భక్తుల రద్దీ అవసరాలకు తగ్గట్లు సౌకర్యాలు లేకపోవడం, సరిపోవడం లేదు. అదేగాక తిరుమలకు భక్తుల సంఖ్యకు తగ్గట్లు 10వరకు మినీక ల్యాణకట్టలను కూడా టిటిడి నిర్వహిస్తోంది. యాత్రికుల వసతి సముదాయాల్లో రెండు, పద్మావతి విచారణ కార్యాలయం, నందకం, కౌస్తుభం, సన్నిదానం, వరాహస్వామి, ఎంబిసి ఇలా కొన్నిచోట్ల అతిధిగృహాలకు, విశ్రాంతి గృహాలకు అనుబంధంగా భక్తుల సౌలభ్యంకోసం నిర్వహిస్తున్నారు. అయినా చాలావరకు సామాన్యభక్తులు ఎంతో పవిత్రంగా సమర్పించే తలనీలాలు ప్రధాన కల్యాణకట్టకు వెళు తుంటారు.దీంతో సాధారణరోజుల్లోనూ కల్యాణకట్టలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఈ నేపధ్యంలో కల్యాణకట్టను అన్ని హంగులతో ఆధునీకరించాలని ఇటీవల టిటిడి ధర్మకర్తలమండలి, అధికారులు నిర్ణయించారు.ఈ పనులు చేపడితే కల్యాణకట్టలో మరింతగా పారిశుధ్యం నిర్వహణ, రద్దీనియంత్రణ, భద్రత ప్రమాణాలను మెరుగుపె వస్తున్నరచడంతో బాటు తలనీలాలు పవిత్రత సమర్పించే భక్తులకు కల్పించినట్లవుతుంది. కల్యాణకట్టలో రద్దీ, అసౌకర్యాలపై పలుమార్లు టిటిడికి భక్తులు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి.

రోజువారీగా తిరుమలకు 80 వేల మంది వరకు భక్తులు ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటుంటే 30వేల మంది వరకు భక్తులు తలనీలాలు సమర్పించుకుంటున్నారు. రద్దీ రోజుల్లో 40వేలమందినుండి 50 వేలమందివ రకు కూడా భక్తులు ఈ మొక్కులు తీర్చుక సంటారు. గత ఏడునెలల కాలంలో 10 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టిటిడి గణాంకాలు. ఇలా నెలవారీగా లక్షమంది వరకు భక్తులు శ్రీ వారికి తలనీలాల మొక్కులు ఇస్తున్నారనేది టిటిడి వర్గాల సమాచారం.ఈ దశలో భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కల్యాణకట్ట ఆధునీకరించాలని టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు, టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి భక్తుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా టిటిడికి ఆదాయం సమూకూరుతోంది. గతంలో ప్రతినెలా వేలంపాటద్వారా విక్రయించే తలనీ ద్వారా వందలకోట్ల రూపాయలులాలు ఆదాయం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com