చిరంజీవిని 'మన శంకరవరప్రసాద్' లో రెండింతలు చూస్తారు: డైరెక్టర్ అనిల్ రావిపూడి

- August 22, 2025 , by Maagulf
చిరంజీవిని \'మన శంకరవరప్రసాద్\' లో రెండింతలు చూస్తారు: డైరెక్టర్ అనిల్ రావిపూడి

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. #Mega157, #ChiruAnil  వర్కింగ్ టైటిల్స్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్  బ్యానర్ పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి "మన శంకరవరప్రసాద్" అనే టైటిల్ పెట్టారు. "పండగకి వస్తున్నారు" అనేది ట్యాగ్‌లైన్‌. టైటిల్ రివీల్ గ్లింప్స్ స్టైలిష్ మాస్ ఎంటర్‌టైనర్‌కు టోన్ సెట్ చేసింది.చిరంజీవి కారులో పవర్ ఫుల్ ఎంట్రీ ఇస్తూ, సిగరెట్ వెలిగిస్తూ, తన ట్రేడ్ మార్క్ స్వాగ్ లో కమాండోల పక్కన నడుస్తుండగా గ్లింప్స్ ప్రారంభమవుతుంది. సిగరెట్ విసిరేస్తున్నప్పుడు టైటిల్ రివిల్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఫ్యాన్స్ ని మరింత సర్ ప్రైజ్ చేసింది.
 
మన శంకరవరప్రసాద్ గారు మెగాస్టార్ కే కాదు, అనిల్ రావిపూడి సిగ్నేచర్ స్టైల్ లో చిరంజీవిని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ అందించారు.  

డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరంజీవి ఎవర్ గ్రీన్ చరిస్మాని, స్టయిల్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ మెగా చరిస్మా అదిరిపోయింది. చివర్లో వచ్చే గుర్రం సీన్ అయితే మైండ్‌బ్లోయింగ్‌.ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే “బాస్..బాస్” చాంట్స్ క్యారెక్టర్‌ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్లేశాయి. అందులోనే మరో సర్ప్రైజ్ రౌడీ అల్లుడులోని కల్ట్ సాంగ్ లవ్ మీ మై హీరోను భీమ్స్ సిసిరోలియో కొత్తగా రీమిక్స్ చేయడం పక్కా నాస్టాల్జియా ఫీల్ ఇచ్చింది.

సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి కెమెరా వర్క్ అదిరిపోయింది. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌ని హీరోయిజం‌తో ఎలివేట్ చేస్తూ టాప్ నాచ్ లుక్ ఇచ్చారు.ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.సినిమా బిగ్ విజువల్ ట్రీట్ ఇవ్వబోతోంది.  

మెగా ఫ్యాన్స్‌కి, సినిమా లవర్స్‌కి ఈ గ్లింప్స్ పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్‌.మెగాస్టార్ ఇంత యంగ్, చార్మింగ్ లుక్‌లో కనిపించడం సెలబ్రేషన్‌లా మారిపోయింది. అంతే కాదు వెంకటేశ్ వాయిస్ ఓవర్ కూడా మరింత స్టార్ అట్రాక్షన్ ఇచ్చింది.

ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌ ఎస్.కృష్ణ, జి.ఆది నారాయణ కో-రైటర్స్‌గా పని చేస్తున్నారు.ఎస్.కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

మాస్, స్టయిల్, నాస్టాల్జియాని పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసిన మన శంకరవరప్రసాద్ ఈ సంక్రాంతికి థియేటర్స్‌లో అదరగొట్టబోతోంది. మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ ట్రడిషన్‌ని కంటిన్యూ చేయనుంది.

టైటిల్ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు.చిరంజీవి బర్త్డే సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్, ఆయన లుక్ పరిచయం చేయాలనుకున్నాం.గ్లింప్స్ కి  రెస్పాన్స్ అదిరిపోయింది.చిరంజీవి  ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన కం బ్యాక్ తర్వాత మెగా స్వాగ్ చూడాలని ఒక కోరిక ఉండేది. నాకు ఎప్పుడు ఆ అవకాశం వస్తుందని ఎదురు చూశాను. ఫైనల్ గా ఆ అవకాశం వచ్చింది. చిరంజీవిని మీరందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా సంక్రాంతికి రెండింతలు చూస్తారు. పాటలు, ఎంటర్టైన్మెంట్ అన్ని అద్భుతంగా కుదిరాయి. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ లో నుంచి మేము శంకరవరప్రసాద్ తీసుకుని ఈ సినిమాలో క్యారెక్టర్ కి పెట్టడం జరిగింది.దాన్నే.. మన శంకరవరప్రసాద్ గారు'గా చేసి సినిమాకి టైటిల్ గా పెట్టాం. క్యాప్షను పండగకి వస్తున్నారు.గింప్స్ కి విక్టరీ వెంకటేష్ గారు వాయిస్ ఇచ్చారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ కి థాంక్యూ. ప్రస్తుతానికి వాయిస్ ఇచ్చారు. వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేష్ కాంబో ఎలా ఉంటుందో ఈసారి పండక్కి చూస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్.చిరంజీవి పాట ఆయన ఆట ఆయన మేనేజర్స్ ఆయన ఫైట్స్ ఆయన లుక్స్ అభిమానించని వాళ్ళు అనుకరించని వాళ్ళు ఎవరు ఉండరు.ఎక్కడో చోట ఆయన ప్రభావం ఉంటుంది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ని నా కంటితో ఎలా చూడాలనుకున్నానో అలా చూసే అవకాశం వచ్చింది.ఈ గ్లింప్స్ జస్ట్ శాంపిలే. సినిమాలో ఇంకా చాలా వున్నాయి. ఈ లుక్ కోసం మేము చేసింది ఏమీ లేదు. ఇందులో చిరంజీవి 95% ఒరిజినల్. ఆయన సినిమా కోసం వెయిట్ లాస్ అయ్యారు. చాలా కేర్ తీసుకున్నారు. నా అదృష్టం కొద్దీ అంతా అద్భుతమైన లుక్ దొరికింది.ఈ క్రెడిట్ అంతా చిరంజీవి గారికి దక్కుతుంది. ఆయన మార్నింగ్ ఈవినింగ్ జిమ్ చేసి లుక్ ని మైంటైన్ చేస్తున్నారు. బీమ్స్ కి ఐడియా చెప్పగానే చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే విజువల్స్ సమీర్ రెడ్డి గారు అదరగొట్టారు.మన శంకర వరప్రసాద్ మీ అంచనాలకు తగ్గట్టే సంక్రాంతికి వస్తున్నారు.

ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల మాట్లాడుతూ..నాన్న పుట్టినరోజున ఆయనతో లేకుండా మీ అందరి ముందు ఇలా ఉండడం బహుశా ఇదే ఫస్ట్ టైం.ఇది వెరీ స్పెషల్ మూమెంట్. అనిల్ గారికి సాహు గారికి థాంక్యూ. ఇది నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్.ఇదే స్టైల్ తో ఇంకా ఎనర్జీతో సంక్రాంతికి వస్తున్నాం.మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మన మెగాస్టార్ కి వెరీ హ్యాపీ బర్త్డే.

ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఈ గ్లిమ్స్ చూసి మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఫాన్స్ అంతకంటే రెట్టింపైన ఉత్సాహంతో ఉన్నారు. నేను, అనిల్ గారు చిరంజీవి గారి సినిమాలు ఎలా చూసామో ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ఇందులో చిరంజీవిని చూపించాం.యూత్ ఫ్యామిలీ ఫ్యాన్స్.. అన్ని జనరేషన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. అనిల్ రావిపూడి గారికి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను.లవ్ యు ఆల్.

నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - లవన్ & కుషన్ (DTM), నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com