కుట్రకు పాల్పడినవాళ్లు భారీ మూల్యం చెల్లించక తప్పదు..

- July 18, 2016 , by Maagulf
కుట్రకు పాల్పడినవాళ్లు భారీ మూల్యం చెల్లించక తప్పదు..

ప్రజా ఉద్యమంతో సైనిక కుట్రను తిప్పికొట్టిన టర్కీ దేశాధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ ఇప్పుడు కొరడా రుళిపించారు. తనను టార్గెట్ చేసిన సుమారు 9000 మంది అధికారులను ఆయన తొలిగించారు. ఇందులో ఓ రాష్ట్ర గవర్నర్ తో పాటు 29 పట్టణాలకు చెందిన గవర్నర్లు కూడా ఉన్నారు. తిరుగుబాటుకు దిగిన సైనిక సిబ్బందిని కూడా దేశాధ్యక్షుడు తొలిగించారు. సుమారు 103 మంది జనరల్స్ ను పదవి నుంచి తీసివేశారు. సైన్యంలో అత్యున్నత హోదాలో సేవలు అందిస్తున్న అధికారులను కూడా తొలిగించారు. అరెస్టు చేసిన సైన్యాధికారులను కోర్టుకు తీసుకెళ్లుతున్నారు. వాళ్లను రిమాండ్ లో ఉంచాలా లేదా అన్న విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు. ఇప్పటికే టాప్ మిలిటరీ జనరల్స్ ను కస్టడీలోకి తీసుకున్నారు. టర్కీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందు వల్లే వాళ్లను ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫెతుల్లా టెర్రర్ సంస్థను నడిపిస్తున్నందన వాళ్లపై చర్యలు కూడా తీసుకోనున్నారు. కానీ గులెన్ మద్దతుదారులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సైనిక కుట్రకు పాల్పడిన వాళ్లకు మరణ శిక్ష విధించాలన్న ఆలోచనలో ఎర్డోగాన్ ఉన్నారు. వాళ్ల పట్ల ఏమాత్రం కనికరం కూడా చూపరాదని ఆయన నిశ్చయించారు. అరెస్టు చేసిన వందలాది మందిని ఇప్పటికే బట్టలు ఊడదీసి కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. దేశ సైనిక వ్యవస్థకు పట్టిన వైరస్ ను పారద్రోలే వరకు విశ్రమించేది లేదన్నారు. కుట్రకు పాల్పడినవాళ్లు భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com