ఖతార్ క్లీనప్ డ్రైవ్: జూలైలో వేల టన్నుల వ్యర్థాలు తొలగింపు..!!
- August 23, 2025
దోహా: పట్టణ పరిశుభ్రత మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి ఖతార్ వ్యాప్తంగా క్లీనప్ డ్రైవ్ చేపట్టారు. అనేక ఇతర సంస్థలతో సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మునిసిపల్ ప్రాంతాల నుండి 41,959 టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించారు. దీంతోపాటు 3,357 దెబ్బతిన్న టైర్లు, 2,469 చనిపోయిన జంతువులను తొలగించారు. వాటితో పాటు వదిలేసిన కార్లు 196, నిర్లక్ష్యంగా వదిలేసిన 61 సైన్ బోర్డులను తొలగించారు. ఈ డ్రైవ్ సందర్భంగా 803 పరిశుభ్రత చట్ట ఉల్లంఘనలను జారీ చేశారు.
ఇక ఖతార్ తీరప్రాంతంలోని బీచ్‌ల నుండి 553.71 టన్నుల సాధారణ వ్యర్థాలను సేకరించారు. ఇందులో 4.34 టన్నుల పునర్వినియోగపరచదగినవి, 163.26 టన్నుల సముద్రపు పాచి, 230.70 టన్నుల కలప వ్యర్థాలు, 9.90 టన్నుల బొగ్గును తొలగించింది. అలాగే సముద్ర జలాల నుంచి 6.64 టన్నుల ఇనుము, 95 ఫిషింగ్ బోనులు, 62 ఫిషింగ్ వలలను స్వాధీనం చేసుకున్నట్లు ఖతార్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







