ఘనంగా ఈటీవీ విన్’ వినోదోత్సవం హ్యాట్రిక్ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్
- August 24, 2025
‘ఈటీవీ విన్’ లో విడుదలైన కానిస్టేబుల్ కనకం, ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా చిత్రాలు అద్భుతమైన విజయంతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. ప్రతి చిత్రం రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ తెలుగు వినోదోత్సవం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు.
తెలుగు వినోదోత్సవం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా టీమ్స్ కి అభినందనలు. కానిస్టేబుల్ కనకంతో ఈటీవీ విన్ లో భాగం కావడం ఆనందంగా వుంది. నిర్మాత సాయి బాబా గారు చాలా సపోర్ట్ చేశారు. నితిన్, సాయి గారికి థాంక్ యూ. ఒక ట్రూ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తీశారు. సురేష్ బొబ్బిలి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ ప్రశాంత్ గారికి థాంక్ యూ. సిరిస్ కి అద్భతమైన రెస్పాన్స్ వస్తోంది. పార్ట్ 2 కూడా రాబోతుంది. నెలకి 29 రూపాయిలు మాత్రమే. తపకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ కి మీరు ఇచ్చిన సపోర్ట్ కి థాంక్యూ సో మచ్.
ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. హ్యాట్రిక్ సక్సెస్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆగస్టు 29 ప్రపంచ తెలుగు దినోత్సవం. దీన్ని ఎవరు జరుపుకోవడం లేదు. ఈటీవీ విన్ సైడ్ నుంచి మేము దీనికి శ్రీకారం చుడుతున్నాం. ఇది తెలుగు వినోదోత్సవం. ఆగస్టు 23 నుంచి 29 వరకు ఈటీవీ విని కేవలం 29 రూపాయలకే సబ్స్రిప్షన్ చేసుకోండి. కానిస్టేబుల్ కనకం, ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా ఈ సినిమాల విజయాల క్రెడిట్ దర్శక రచయితలకు నటీనటులకు, ఈ విన్ టీంకు దక్కుతుంది. పైర సీపై మా ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. న్యాయంగా చూడండి. అందరి జీవితాల్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. కానిస్టేబుల్ కనకం, ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా ఈ మూడు సక్సెస్ మీట్ లు కలుపుకొని ఒక వేడుకగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈటీవీ విన్ లో మనందరికీ నచ్చే మన కథలు ఉంటాయి. అవి ఉన్నంతకాలం మనం ఇలా కలుస్తూనే ఉంటాం. కానిస్టేబుల్ కనకం, ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా చిత్రాలను ఘనవిజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. సాయిబాబా గారికి థాంక్యూ సో మచ్. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఈ మూడు సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. కానిస్టేబుల్ కనకం, ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా చిత్ర బృందాలకు నా శుభాకాంక్షలు నిర్మాత సాయిబాబా గారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు అలాగే నితిన్ సాయి కృష్ణ కూడా. కానిస్టేబుల్ కనకం సిరీస్ ని ఫ్యామిలీస్ తో కలిసి చూస్తున్నారు. సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు.
ప్రొడ్యూసర్ సాయిబాబా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను 1985లో ఇండస్ట్రీ కి వచ్చాను. అప్పటికి ఈటీవీ విన్ టీంలో ఎవరో పుట్టి ఉండరు. ఈరోజు నేను వాళ్ళతో కలిసి పని చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అప్కమింగ్ అట్రాక్షన్ అని నాలుగు సినిమాలు వేశారు. ఇంకో ఎనిమిది కలుపుకొని 12 సినిమాలు ట్రిపుల్ హ్యాట్రిక్ అవ్వాలని ,ఆ ఫంక్షన్ కి నేను రావాలని, ఆ 12లో రెండు మా బ్యానర్ నుంచి ఉండాలని కోరుకుంటున్నాను.
బివిఎస్ రవి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కానిస్టేబుల్ కనకం, ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా చిత్ర బృందాలకు కంగ్రాజులేషన్స్. ఇలాంటి విజయాలు ఈటీవీ విన్ వలనే సాధ్యం. సాయిబాబా గారు ఈ టీం ని ఎంతగానో ఇన్స్పైర్ చేశారు. సాయి నితిన్ వరుసగా హిట్స్ కొడుతున్నారు అంటే మామూలు విషయం కాదు. ఈటీవీ విన్ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ ఒక గౌరవం. ఈటీవీ బెంచ్ మార్క్ ని ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఇంత అద్భుతమైన సినిమాలు అందిస్తున్నారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఎన్నో అద్భుతమైన విజయాలు ఈటీవి విన్ లో రాబోతున్నాయి.
డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. కలర్ ఫోటో ఓటీటీ లో రిలీజ్ అయినప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాంటి రెస్పాన్స్ లో ఓటీటీ రిలీజ్ అయిన మరి ఏ సినిమాకి రాదేమో అనుకున్నాను. కానీ ఎయిర్ దానికంటే ఎక్కువ రీచ్ వెళ్లింది. నేను యాక్టర్ కావాలనే కళ ఈ ఎయిర్ తో తీరింది. ఈ సిరీస్ కి మొదటి నుంచి ఏదో రకంగా ఇందులో భాగమవాలని అనుకున్నాను. మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సిరీస్ ఇది. ఎయిర్ సిరీస్ అందులో ఉన్న ఎమోషన్స్ వల్ల జనాలకి గుర్తు ఉండాలని మేము భావించాం. అయితే అందులో ఒక్క సీన్ కాంట్రవర్సీ క్రియేట్ చేసిందన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. అందరికీ సారీ చెప్పాం. సిరీస్ కి ఆడియన్స్ ఇచ్చిన ప్రేమని నేను అసలు ఊహించలేదు. అందరు కూడా దీని సెకండ్ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ మాకు ఎంతో బ్యూటిఫుల్ జర్నీ ఇచ్చింది. ఈ సక్సెస్ మీట్ లో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది.
యాక్టర్ చైతన్య రావు మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఈటీవీ విన్ టీం కి అభినందనలు. హ్యాట్రిక్ విజయాలు అంత ఈజీ కాదు. చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానిస్టేబుల్ కనకం, ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా టీమ్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్.
యాక్టర్ హర్ష మాట్లాడుతూ... అందరికి నమస్కారం. నాకు కలర్ ఫోటో లాంటి సినిమా ఇచ్చి లైఫ్ మార్చేసాడు సందీప్. ఎయిర్ లో మళ్ళీ ఒక మంచి పాత్రలో చూపించినందుకు సందీప్ కి జోసెఫ్ కి థాంక్యూ. పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈటీవీ విన్ లో వచ్చే కంటెంట్ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. అందరికీ అభినందనలు.
డైరెక్టర్ జోషఫ్ మాట్లాడుతూ.. ఈటీవీ విన్ కి థాంక్ యు.సిరిస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నితిన్ సాయి గారికి థాంక్యూ. సందీప్ అన్న షో రన్నర్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
డైరెక్టర్ సన్నీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కానిస్టేబుల్ కనకం,ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా టీమ్స్ కి కంగ్రాట్యులేషన్స్. అవకాశం అనేది చాలా గొప్పది.మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక హిట్టు కొట్టడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో వరుసగా మూడు విజయాలు అందుకున్నారు.ఈ ఏడాదంతా ఈటీవీ విన్ విన్ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూడు చిత్రాల యూనిట్ సభ్యులు హాజరైన ఈ వేడుక ఘనంగా జరిగింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!