వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరు

- August 24, 2025 , by Maagulf
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరు

లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR), యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా మరియు యూఏఈలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ, వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకదాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణకి ప్రదానం చేస్తున్నారు-భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు WBR గోల్డ్ ఎడిషన్‌లో నమోదు అవుతుంది.

ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ అపూర్వమైన సినిమా జైత్రయాత్ర కి అత్యంత గౌరవప్రదమైన ఘనతగా నిలుస్తుంది- 0 ఘనమైన సంవత్సరాలు ప్రముఖ హీరోగా కొనసాగిన అద్భుతమైన మైలురాయి, ఇది ప్రపంచ సినిమాలో కూడా అత్యంత అరుదైన సంఘటన గా నిలుస్తుంది. తన కెరీర్ అంతటా, బాలకృష్ణ గారు తన తండ్రి, లెజెండరీ నందమూరి తారక రామారావు (NTR)  శాశ్వత వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, టాలీవుడ్‌లో తన ఆల్ రౌండర్ ప్రతిభతో, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన కళపట్ల అవిరామమైన నిబద్ధతతో తనదైన గుర్తింపును సాధించుకున్నారు. ఆయన ప్రయాణం ఉత్సాహం, క్రమశిక్షణ మరియు శాశ్వత కళాత్మకతకు సాక్ష్యం, ఇది అన్నితరాల సినిమా ప్రేమికులను వారికి అభిమాన పాత్రులను చేసింది.

అందరు కళాకారులలాగానే,బాలకృష్ణ మార్గంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు, కానీ ఆయన స్థిరత్వం, ధైర్యం మరియు విభిన్న పాత్రలతో నిరంతర ప్రయోగాలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిశ్రమలో ఆయనను విజేతగా నిలిపాయి.

ఆయన గౌరవాల జాబితాకు బాలకృష్ణ గారు గతంలో సినిమా మరియు సమాజానికి చేసిన సేవలకు భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ భూషణ్‌తో సత్కరించబడ్డారు. అంతేకాకుండా, ఆయన విమర్శకులచే ప్రశంసించబడిన మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రం భగవంత్ కేసరి ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది.

బాలకృష్ణ గారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అద్భుతమైన హ్యాట్రిక్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు, ప్రజల విశ్వాసం మరియు ప్రేమను మరోసారి గెలుచుకున్నారు. ఆయన అవిరామ నిబద్ధత మరియు డైనమిక్ లీడర్‌షిప్‌తో, హిందూపుర్‌ను మార్చడమే కాకుండా దానిని ఆదర్శ నియోజకవర్గంగా రూపొందించారు. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలలో బెంచ్‌మార్క్‌లను సృష్టించారు.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ సంతోష్ శుక్లా గారు జారీ చేసిన అధికారిక ప్రశంసలో, బాలకృష్ణ గారి ఐదు దశాబ్దాల సినిమా సేవలను మిలియన్ల మందికి స్ఫూర్తిగా ప్రశంసించారు - ఇది భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్‌మార్క్‌ను స్థాపించిన వారసత్వం. సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయి ఉండి నిరంతరం తనను తాను పునర్నిర్మించుకునే ఆయన సామర్థ్యం, ప్రముఖ నటుడి ప్రయాణాన్ని మాత్రమే కాకుండా తరాలను కలిపే సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

కానీ బాలకృష్ణ గొప్పతనం సిల్వర్ స్క్రీన్‌కు మించి విస్తరించింది. గత 15 సంవత్సరాలుగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా, ఆయన పబ్లిక్ సర్వీస్‌ను ఒక ఉదాత్త మిషన్‌గా నిరూపించారు - జీవితాలను మార్చడం, ఆశను అందించడం మరియు అత్యంత అవసరమైన వారికి కరుణామయ ఆరోగ్య సేవలు చేరువ చేయడం.. కళాత్మక ప్రతిభ మరియు మానవతావాద లీడర్‌షిప్ యొక్క ఈ అరుదైన కలయిక, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గర్వంగా నిలబడే స్థిరత్వం, అంకితభావం మరియు సామాజిక ఉద్ధరణ యొక్క గొప్పతనాన్ని నిరూపిస్తుంది.

నట సింహం నందమూరి బాలకృష్ణ WBR గోల్డ్ ఎడిషన్‌లో చేరిక ఒక గుర్తింపు కంటే ఎక్కువ - ఇది అర్ధ శతాబ్దానికి పైగా స్టార్‌డమ్‌ను పునర్నిర్వచించిన ఐకానిక్ నటుడి ప్రపంచవ్యాప్త ఉత్సవం. ఆయన ఆరోగ్య సేవలు మరియు సామాజిక కారణాలకు చాంపియన్ అయిన కరుణామయ నాయకుడు మరియు తరాలను స్ఫూర్తిపరిచే సాంస్కృతిక రాయబారి.

ఈ గౌరవంతో, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అసాధారణ సాధనలలో అద్భుత మైలురాళ్లను మాత్రమే కాకుండా వ్యక్తులను నిజమైన లెజెండ్‌లుగా చేసే మానవ విలువలు మరియు సేవలను గుర్తించే తన మిషన్‌ను బలపరుస్తుంది.

భారతీయ సినిమాలో హీరోగా ఆయన అసాధారణ సేవలకు గుర్తింపుగా..వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలకృష్ణ చేరికను ఘనమైన గుర్తింపుగా, WBR CEO ఆగస్టు 30వ తేదీన హైదరాబాదులో స్వయంగా బాలకృష్ణ కి అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com