'ది ప్యారడైజ్' కోసం హాలీవుడ్ కొలాబరేషన్
- August 31, 2025
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ 'ది ప్యారడైజ్' లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు.దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బిహైండ్ ది సీన్స్ 'స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్' గ్లింప్స్ తో అంచనాలని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది.
'ది ప్యారడైజ్' ను గ్లోబల్ సినిమా విజన్ తో చాలా గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తో మేకర్స్ యూనివర్సల్ విజన్ అందరికీ అర్ధమైయింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్, బోల్డ్ ప్రమోషన్స్ అన్నీ గ్లోబల్ మూవీ దిశగానే సాగుతున్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే..ది ప్యారడైస్ టీం హాలీవుడ్‌లోని #ConnekktMobScene ఎగ్జిక్యూటివ్ VP ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటిని కలసి సినిమా కోసం కొలాబరేషన్ డిస్కస్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ వాళ్ల ఇంటర్నేషనల్ ప్లాన్స్‌ని మరింత స్ట్రాంగ్‌గా ప్రజెంట్ చేస్తోంది.
మొదటినుంచే ఈ ప్రాజెక్ట్‌ని రీజనల్ సినిమా లాగా కాకుండా, పాన్-వరల్డ్ మూవీలా ట్రీట్ చేస్తున్నారు. ఆగ్రెసివ్ ప్రమోషన్స్ తో ఇప్పటి నుంచే అన్ని లాంగ్వేజెస్‌లో, మార్కెట్స్‌లో, ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అయ్యింది.
2026 మార్చిలో వరల్డ్‌వైడ్ రిలీజ్‌కి రెడీ అవుతుండగా, ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్ ది ప్యారడైస్ ని ఇండియా నుంచి వచ్చే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా చెబుతున్నారు.
ఇంటర్నేషనల్ వెర్షన్‌లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఇండియాలో భారీ సంఖ్యలో పాలోవర్స్ ని కలిగి ఉన్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడిని తీసుకురావడానికి టీం చర్చలు జరుపుతోంది. ఇది ప్రాజెక్ట్‌కి ఇంకో గ్లోబల్ డైమెన్షన్‌ని జోడిస్తుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాటోగ్రఫీకి సి.హెచ్. సాయి, మ్యూజిక్‌కి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, ఎడిటింగ్‌కి నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్‌కి అవినాష్ కొల్లా పని చేస్తున్నారు.
ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







