పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఓజీ నుంచి గ్లింప్స్
- September 02, 2025
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు సినీ బృందం నుంచి పెద్ద గిఫ్ట్ వచ్చింది. ‘ఓజీ’ (OG) సినిమాకి సంబంధించిన మాస్ గ్లింప్స్‌ను చిత్రబృందం సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఉత్సాహంగా ముంచెత్తుతోంది.
యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ను ఒక నయా యాంగిల్‌లో చూపించారు.విడుదలైన గ్లింప్స్‌లో ఆయన పవర్‌ఫుల్ యాక్షన్, స్టైల్, డైలాగ్ డెలివరీ అభిమానులకు గూస్‌బంప్స్ తెచ్చేలా ఉన్నాయి.
ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ పనిచేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమా స్థాయి ఏంటో అర్థమయ్యేలా చేస్తోంది.
‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ గ్లింప్స్ విడుదలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫ్యాన్స్ ఇప్పటికే ట్రెండ్స్‌లో సినిమా పేరును దూసుకెళ్లిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!