రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధర..
- September 03, 2025
దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగుల వేళ బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. తద్వారా ఆల్టైమ్ గరిష్టాలకు గోల్డ్ రేటు చేరుకుంటుంది. గడిచిన పది రోజులు 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.6వేలు పెరిగింది.
బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.880 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఔన్సు గోల్డ్ పై 10డాలర్లు పెరిగింది.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 3,537 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
మరోవైపు.. వెండి ధరసైతం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. బుధవారం కిలో వెండిపై రూ. 900 పెరిగింది. దీంతో గడిచిన ఐదు రోజుల్లో కిలో వెండిపై సుమారు రూ. 7,500 పెరిగింది. బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఓ సారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
- తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.98,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,06,970కు చేరింది.
- దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,07,120కు చేరింది.
- ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.98,050 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,06,970కు చేరింది.
వెండి ధర ఇలా..
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,37,000కు చేరింది.
- ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,27,000కు చేరింది.
- చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,37,000కు చేరింది.
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







