ఏషియన్ మస్క్యూలో స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా వి.ఎన్.వరప్రసాద్
- September 04, 2025
విజయవాడ: ఏషియన్ మస్క్యూలో స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించడం శుభపరిణామం అని పలువురు వక్తలు ప్రశంసించారు.డాక్టర్ వేమూరి నాగ వరప్రసాద్ ఏషియన్ మస్క్యూలో స్కెలిటల్ సొసైటీ నూతన అధ్యక్షునిగా నియామకం కావడం, బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇండియన్ రేడియాలజి అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జి.వి.మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ మినర్వాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వర ప్రసాద్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ జి.వి.మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్ వేమూరి నాగ వరప్రసాద్ గతంలో ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ (ICRI) అధ్యక్షునిగా మరియు ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అధ్యక్షులుగా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు.అదేవిధంగా ఏషియన్ మస్క్యూలో స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించక ముందు ఈ సంఘానికి సెక్రటరీ జనరల్‌గాను మరియు ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా కూడా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఈ పదవి నిర్వహిస్తున్న మొట్టమొదటి భారతీయ రేడియాలజిస్టుగా డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ ఎంపిక కావడం దేశానికి గర్వకారణమన్నారు. డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ మాట్లాడుతూ, వివిధ దేశాలలో గల సొసైటీలు మరియు రేడియాలజీలోని మస్క్యూలో స్కెలిటల్ విభాగంలో ఉన్న పద్దతుల మధ్యలో అంతరాలను సరిచేస్తూ వాటిని అనుసంధానం చేయడం అనే నినాదంతో సింగపూర్‌లో నిర్వహించిన 27వ వార్షిక సమావేశంలో ఎన్నికైన తాను, వచ్చే రెండేళ్ళలో ఈ థీమ్ లక్ష్యాన్ని నెరవేరుస్తానని తెలిపారు. వివిధ వ్యాధి నిర్ధారణ పద్దతుల మధ్యన ఉన్న హద్దులను తొలగిస్తూ ఒక నిర్ణయానికి రావడం దీనిపై ప్రపంచ స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు ఆసియా ఖండంలోని వివిధ దేశాల మస్క్యూలో స్కెలిటల్ రేడియాలజీ సంఘాల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. శరీరంలోని కీళ్లు, కండరాలు, ఎముకలతో కూడిన ఈ మస్క్యూలో స్కెలిటల్ విభాగం వ్యాధి నిర్థారణలో ఆధునిక పద్దతులైన ఆర్టిషిఫీయల్ ఇంటిలిజెన్స్ (కృత్రిమ మేథ)తో నూతనంగా రూపొందించిన సిటీస్కాన్, ఎమ్మారై, అల్ట్రాసౌండ్ వంటి పరికరాలు మస్క్యూలో స్కెలిటల్ రేడియాలజీ వైద్యంలో కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. ఈ విధానాలపై సమావేశంలో వివిధ దేశాలు నుండి హాజరైన నిష్ణాతులు చర్చించారని పేర్కొన్నారు. సింగపూర్‌లో జరిగిన 27వ వార్షిక సమావేశంలో తాను ఏషియన్ మస్క్యూలో స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. పదవీకాలం రెండు సంవత్సరాలు పాటు ఉంటుందని, 2027 ఆగష్టు నెల వరకు తాను ఈ పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. సమావేశంలో ఐఆర్ ఐఏ , సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చలసాని కులదీప్, ఐఆర్ఐ ఏ విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బి. రాజ్ కుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!
- కువైట్‌లో నేడు క్లాసెస్ రద్దు..!!
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం







