'తెలుసు కదా' షూటింగ్ పూర్తి చేసుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా
- September 07, 2025
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.
'తెలుసు కదా' జర్నీ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ..కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరిచిపోలేని కథలు ఉంటాయి... ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలన్నీ కలగలిసిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన అద్భుతమైన టీంకి కృతజ్ఞతలు. మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజుకోసం ఎదురుచూస్తున్నాను. ఇది మీకు ఒక గొప్ప రైడ్‌గా ఉంటుంది.
థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.ఫస్ట్ సింగిల్ - మల్లికా గంధ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి డీవోపీ జ్ఞాన శేఖర్. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొళ్ల ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్ షీతల్ శర్మ.
తెలుసు కదా సినిమా ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.
తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
DOP: జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!