కిష్కింధపురి కంటెంట్, కాన్సెప్ట్ పై పూర్తి నమ్మకం వుంది: హీరో శ్రీనివాస్
- September 07, 2025
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది.ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం విజయవాడ వచ్చి ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ కంటెంట్ మీద చాలా నమ్మకం ఉంది. చాలా హారర్ సినిమాలు చూస్తుంటారు. కానీ 'కిష్కింధపురి'. చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు ఇలాంటి హారర్ సినిమా రాలేదు. కాన్సెప్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాము. ట్విస్టులు, షాక్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. మాకు మిరాయయ్ తో పోటీ లేదు. ముందు మేమే రిలీజ్ డేట్ ఇచ్చాం. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని హిట్ చేస్తారు. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత సాహు గారు నిర్మించారు. నిజమైన హంటింగ్ హౌస్ లో దీన్ని సూట్ చేసాము. ఈ సినిమా షూటింగ్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఆడియన్స్ ఒక బెస్ట్ హారర్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు.
హీరోయిన్ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పరదా ప్రమోషన్స్ కి ఇక్కడికి వచ్చాను. మళ్లీ ఇప్పుడు 'కిష్కింధపురి' ప్రమోషన్స్ తో రావడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ ప్రేక్షకులు నాపై ఎంతగానో ప్రేమ చూపించారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు చిన్నప్పటి నుంచి హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా ఒక యూనిక్ హారర్. డైరెక్టర్ కథ చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. 'కిష్కింధపురి' తెలుగు బెస్ట్ హారర్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. మీ అంచనాలను అందుకుంటుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!