సౌదీ అరేబియా ఆధ్వర్యంలో గల్ఫ్ కౌంటర్ టెర్రరిజం గ్రూప్..!!
- September 08, 2025
రియాద్: సౌదీ అరేబియాకు చెందిన కల్నల్ నాజర్ అల్-సుబైని ఉగ్రవాద నిరోధక అరబ్ నిపుణుల బృందానికి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. కైరోలో జరిగిన అరబ్ లీగ్ కౌన్సిల్ 164వ రెగ్యులర్ సెషన్ ముగింపు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పరిపాలనా మరియు ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఖతార్ రాయబారి సాద్ అల్-తమీమిని నియమించగా.. పాలస్తీనా రాయబారి ఫయేద్ ముస్తఫాను అరబ్ లీగ్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా ఐదు సంవత్సరాల కాలానికి నియమించారు.
ఇక మాడ్రిడ్, బెర్లిన్, పారిస్, అర్జెంటీనా, న్యూఢిల్లీ, మాస్కో, లండన్, మరియు సోమాలియాలోని లీగ్ కార్యాలయాల అధిపతుల ఒప్పందాల పునరుద్ధరణకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రెండేళ్ల కాలానికి విదేశాలలో ఖాళీగా ఉన్న అరబ్ లీగ్ మిషన్లు లేదా కార్యాలయాలలో ఒకదానికి అధిపతిగా పాలస్తీనియన్ రాయబారి ఇబ్రహీం అల్-జాబెన్ నియామకాన్ని కూడా కౌన్సిల్ ఆమోదించింది.
తాజా వార్తలు
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్‌పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!