ఇజ్రాయెల్ అస్థిర చర్యలను ఆపండి..!!
- September 10, 2025
రియాద్ః ఇజ్రాయెల్ అస్థిర చర్యలను ఆపాలని ప్రపంచదేశాలకు సౌదీ అరేబియా కోరింది. ఖతార్ పై ఇజ్రాయెల్ దాడులపై సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ స్పందించారు. ఖతార్ ప్రధాన మంత్రి మషేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. ఇజ్రాయెట్ దాడులను ఖండించారు. ఖతార్ కు అన్ని విధాల మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఇజ్రాయెల్ ది నేరపూరిత చర్య అని, అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు.
ప్రిన్స్ ఫైసల్ ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు బదర్ అబ్దేల్ అటీ మరియు జోర్డాన్ అయిమాన్ సఫాదిలతో ఫోన్‌లో చర్చలు జరిపారు. మిడిల్ ఈస్ట్ భద్రత, స్థిరత్వాన్ని అస్థిరపరిచే ఇజ్రాయెల్ చర్యలను ఆపడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని అప్పీల్ చేశారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







