ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- September 10, 2025
యూఏఈః దోహాలో హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు తెగబడటాన్ని గల్ఫ్ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఇది ఖతార్ రాష్ట్ర సార్వభౌమత్వాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌పై జరిగిన దాడిగా అభిర్ణించాయి.
సౌదీ అరేబియా ఇజ్రాయెల్ వి దురాక్రమణ చర్యగా పేర్కొంది. ఖతార్ తీసుకునే అన్ని చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపింది. ఖతార్ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా ఒమన్ తెలిపింది.
ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ శాంతిని నేరుగా దెబ్బతీస్తాయని, ఈ ప్రాంతంలో సార్వభౌమత్వాన్ని గౌరవించాలని కువైట్ పేర్కొంది. ఇజ్రాయెల్ ది పిరికి చర్యగా పేర్కొన్న జోర్డాన్..దాడులను తప్పుబట్టింది. ఖతార్ కు అండగా ఉంటామని, తదుపరి తీసుకునే చర్యలకు ఒకటి నిలిచి మద్దతు ఇస్తామని గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాలు తేల్చిచెప్పాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







