రియల్ ఎస్టేట్, పిల్లల చట్టాలకు కువైట్ ఆమోదం..!!
- September 10, 2025
కువైట్: బయాన్ ప్యాలెస్‌లో కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటి పీఎం షరీదా అబ్దుల్లా అల్-మౌషెర్జీ క్యాబినెట్ సమావేశ వివరాలను వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా కువైట్ సావరిన్ క్రెడిట్ స్థితిని బలోపేతం చేయడానికి ఆర్థిక సంస్కరణలను కొనసాగించడానికి క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ (T2) ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను క్యాబినెట్ ఆదేశించింది.
పిల్లల హక్కులపై 2015 నంబర్ 21 చట్టంలోని కొన్ని నిబంధనలను సవరించే ముసాయిదా చట్టాన్ని మంత్రివర్గం ఆమోదించింది. వజాత శిశువులను తండ్రి జాతీయత పోర్ట్‌ఫోలియోలో చేర్చనున్నారు. ఆర్టికల్ 81లో పేర్కొన్న విధంగా నిబంధనలను పాటించకపోతే జరిమానాలు విధిస్తారు. ఫత్వా మరియు లెజిస్లేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిక్రీ-లా కోసం వివరణాత్మక మెమోరాండంను సిద్ధం చేస్తుంది. దీనిని హిస్ హైనెస్ అమీర్ ఆమోదం కోసం సమర్పిస్తారు.
1979 డిక్రీ-లా నంబర్ 74 ప్రకారం కువైటీయేతరులు రియల్ ఎస్టేట్ యాజమాన్యంపై నియంత్రణలకు సంబంధించిన ముసాయిదా డిక్రీలను, కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యుడీషియల్ అండ్ లీగల్ స్టడీస్‌ను క్యాబినెట్ సమీక్షించి ఆమోదించింది.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







