రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!

- September 10, 2025 , by Maagulf
రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!

మనామా: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుని ప్రత్యేక సలహాదారుడు, ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ అల్ సౌద్ బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. మనమాలోని అల్-సఫ్రియా ప్యాలెస్‌లో కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా సౌదీ అరేబియా-బహ్రెయిన్ మధ్య బలమైన సంబంధాలను గుర్తుచేసుకున్నారు.  రెండు దేశాల ప్రజలు నిరంతర అభివృద్ధి పథాన పయనించాలని ఆకాంక్షించారు.  ఈ క్రమంలో బహ్రెయిన్‌- సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక సంబంధాలను పరస్పరం పంచుకున్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక, శాస్త్రీయ మరియు జ్ఞాన ఆధారిత సహకారాన్ని మరిన్ని రంగాల్లో విస్తరించాలని నిర్ణయించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com