నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు

- September 10, 2025 , by Maagulf
నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు

ఇప్పటికే వలసవాదులపై ట్రంప్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలో భారతీయులకు గడ్డుకాలమే వచ్చింది. ప్రస్తుతం బ్రిటన్, కెనడా దేశాలు కూడా విదేశీయులపై కఠిన చర్యలకు దిగింది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత గ్రీన్కార్డులు, వీసాల జారీలపై పలు ఆంక్షల్ని విధించారు. తాజాగా గ్రీన్కార్డ్ పొందడానికి అవకాశం ఉన్న మరో మార్గం కూడా తాజాగా నిలిచిపోయింది. ఈబీ-3, ఈడబ్ల్యూ వీసాల జారీని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ని లిపివేసింది.

ఆర్థిక సంవత్సరానికి వాటి కోటా పూర్తి
2024-2025 ఆర్థిక సంవత్సరానికి వాటి కోటా పూర్తికావడమే అందుకు కారణం. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు అమెరికా దౌత్య కార్యాలయాలు ఈ వీసాలను జారీ చేయవు. అక్టోబర్ఒకటి తర్వాతే కొత్త కోటాపై నిర్ణయం వెలువడనుంది. అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబర్ఒకటితో మొదలై సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. దీంతో మరికొంతకాలం గ్రీన్కార్డు వీసాల కోసం వేచి ఉండక తప్పదు. ఇప్పటికే వీసాల కఠిన నిబంధనలతో చాలామంది విద్యార్థులు తమ అమెరికా పయననిర్ణయాలను మార్చుకుని, ఇతర దేశాలకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో భారీగా విద్యార్థిలు సంఖ్య కూడా తగ్గింది.

గ్రీన్ కార్డ్ వీసాలు ఎందుకు నిలిచిపోయాయి?
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో మార్పులు, పెరిగిన అప్లికేషన్ల సంఖ్య, పరిమిత వీసా కోటా, మరియు ప్రాసెసింగ్ ఆలస్యం కారణంగా గ్రీన్ కార్డ్ వీసాలు నిలిచిపోయాయి.

ఈ నిర్ణయం ఎవరిపై ప్రభావం చూపుతోంది?
ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు మరియు వారి కుటుంబాలు దీనివల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com